అనుమానాస్పద స్థితిలో వివాహిత మరణం: భర్తను అదుపులోకి తీసుకొన్న పోలీసులు
వరంగల్ :హాన్మకొండ పట్టణంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది.ఉరి వేసుకొని లావణ్య ఆత్మహాత్య చేసుకొందని భర్త చెబుతున్న మాటలపై లావణ్య తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హాన్మకొండ కుమార్ పల్లిలో దౌడబోయిన లావణ్య అనుమానాస్పదస్థితిలో మరణిచింది. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆమె మరణించిందని భర్త సుదీర్ పోలీసులకు చెప్పాడు. కాని ఎవరూ రాకముందే కిందకు దింపడం పట్ల అనుమానాలు వ్యక్తమయ్యాయి

వరంగల్ కొత్తవాడకు చెందిన సాక బాలరాజు, విజయలక్ష్మిల కుమార్తె లావణ్యను కాజీపేటకు చెందిన తొడబోయిన సమ్మయ్య, కమలమ్మ కుమారుడు సుదీర్ కు 8 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వివాహసమయంలో కట్నంతో పాటు ఇతర లాంచనాలను ముట్టజెప్పారు.సుదీర్ ఇంట్లో ఉంటూ ఆన్ లైన్ లో షేర్ వ్యాపారం నిర్వహించేవాడు.
కాజీపేటలో తన వాటాకు వచ్చిన ఇళ్ళను అమ్మి వచ్చిన డబ్బును 10 లక్షలను షేర్ మార్కెట్ లో పెట్టి నష్టపోయాడు సుధీర్ .నాలుగేళ్ళ క్రితం హాన్మకొండ కుమార్ పల్లిలో అద్దెకు దిగాడు. మంగళవారం తెల్లవారుజామున తన భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొందని ఏడుస్తూ బయటకు వచ్చాడు. ఫ్యాన్ కు ఉరివేసుకోవడంతో తానే దింపానని సుధీర్ స్థానికులకు చెబుతున్నాడు.సుధీర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications