Huzurabad By poll: దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు..నోటిఫికేషన్ ఎప్పుడంటే!!
హుజురాబాద్ లో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంగా కావలసినంత రచ్చ కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణా ఫోకస్ అంతా హుజురాబాద్ ఎన్నికలపైనే ఉంది. ఇక నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని చర్చ మొదలైంది.

కేసీఆర్ వర్సెస్ ఈటల .. హుజురాబాద్ లో రసవత్తర రాజకీయం
టిఆర్ఎస్ పార్టీ నుండి మంత్రులు ఏకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో రంగంలోకి దిగి పెద్ద ఎత్తున గులాబీ పార్టీ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా కీలక నాయకులను రంగంలోకి దింపి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, సీఎం కేసీఆర్ తీరును ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. మొన్నటివరకు టీఆర్ఎస్ లో కీలకంగా పని చేసిన ఈటల కేసీఆర్ తో మైండ్ గేమ్ ఆడుతున్నాడు.

హుజురాబాద్ ఉప ఎన్నికపై కేసీఆర్ ఫోకస్
ఇప్పటికే హుజురాబాద్ లో రాజకీయం పీక్స్ కి చేరింది. బడా నేతల యాత్రలతో హుజురాబాద్ లో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కొనసాగి, అవమానకర రీతిలో టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం గా మారింది. అయితే స్థానికంగా పట్టున్న ఈటల రాజేందర్ తిరిగి హుజూరాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగరేస్తాం అన్న ధీమాతో ఉండగా, ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టి, రాజకీయాలలో ఆయన ఉనికిని ప్రశ్నార్ధకం చేయడానికి గులాబీ బాస్ రంగంలోకి దిగారు.

సెప్టెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ కు ఛాన్స్
వ్యూహాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కీలక నేతలు నియోజకవర్గంలో మండలాల వారీగా పనిచేస్తూ పార్టీకి మద్దతును కూడగడుతున్నారు. ఎన్నికల రాజకీయం పీక్స్ లోకి చేరుతున్నా హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది? నోటిఫికేషన్ ఎప్పుడు జారీ అవుతుంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది. కరోనాని సాకుగా చూపి ఎన్నికల కమిషన్ ఎన్నికను వాయిదా వేస్తుందా ? లేక ఎన్నికల నిర్వహణకు ఆసక్తి చూపుతుందా అన్న చర్చ జరుగుతున్న క్రమంలో, తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ సెప్టెంబరు నెలలో వస్తుంది అన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఎన్నికలను నిర్వహించాలని అన్ని పార్టీల ఏకాభిప్రాయం
గత నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావించిన రాజకీయవర్గాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ కరోనా నేపథ్యంలో రాసిన ఒక లేఖ ఎన్నికలకు మరింత సమయం పడుతుంది అన్న సంకేతాలను ఇచ్చింది. ఆగస్టు 9వ తేదీన విడుదల చేసిన లేఖలో కరోనా పరిస్థితులలో ఎన్నికలు జరగాల్సిన చోట అనుసరించాల్సిన అనేక మార్గదర్శకాలపై ప్రధానంగా ప్రస్తావించింది. అన్ని పార్టీల అభిప్రాయాన్ని ఆగస్టు 30వ తేదీలోగా వెల్లడించాలని పేర్కొనే కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 28 వ తేదీన అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంది. ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.

ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని పార్టీ అధిష్టానాల దిశా నిర్దేశం
బీజేపీ నుండి తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. మరోవైపు అధికార పార్టీ సైతం సెప్టెంబర్లోనే ఉప ఎన్నిక ఉంటుందని, పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని హుజురాబాద్ కేంద్రంగా నిర్వహిస్తోంది. నియోజక వర్గంలో అన్ని వర్గాలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన నేతను రంగంలోకి దిగడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పేరు ప్రకటించి ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్ళింది. మరోవైపు తన ఎమ్మెల్యే స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం ఈటెల రాజేందర్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలతో హోరెత్తిస్తున్నారు.

తెలంగాణాతో పాటు ఏపీలో కూడా ఉపఎన్నిక
ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో వివిధ వర్గాల నుండి అటు టిఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ నివేదికలు తెప్పించుకొని ఉప ఎన్నిక జరిగితే ఏ విధంగా ఉంటుందన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ రెండు ఉప ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ నెలలోనే వస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

సెప్టెంబర్ మాసంలోనే ఎన్నికలు ? ప్రచారంలో జోరు పెంచిన పార్టీలు
ఏదేమైనప్పటికీ ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ నెలలో ఎప్పుడైనా రావచ్చని, ఎన్నికలకు సమాయత్తం కావాలని అటు బిజెపి అధినాయకత్వం, ఇట్లు టిఆర్ఎస్ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు సూచించినట్లుగా సమాచారం. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంగా కొనసాగుతున్న రాజకీయ రగడ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. టిఆర్ఎస్ పార్టీ నేతలకు దీటుగా బిజెపి జాతీయ నాయకులతో సైతం ప్రచారం నిర్వహించాలని బిజెపి భావిస్తోంది. ఏదేమైనప్పటికీ సెప్టెంబర్ మాసంలో ఉపఎన్నికలు ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్న తరుణంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచార హోరును పెంచారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications