Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హుజురాబాద్ పోరు: పోటీ చేస్తామంటున్న చేనేత కార్మిక కుటుంబాలు..ఎంపీటీసీల తరహాలోనే

హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా మందిలో చైతన్య స్ఫూర్తిని రగులుస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో హుజురాబాద్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్న కెసిఆర్ హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పాటిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి చకచకా పనులు చక్కబెడుతున్నారు. ఇక ఈ పరిణామాలు కేసీఆర్ కు అనుకూలంగా మారతాయని భావిస్తే ప్రతికూల వాతావరణం సృష్టిస్తున్నాయి.

నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ ..

నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ ..

రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్న భావన చాలా నియోజకవర్గాల్లో ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో హుజురాబాద్ అభివృద్ధి నేపధ్యంలో ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారింది. సోషల్ మీడియాలో రాజీనామాల డిమాండ్ల రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న ఎంపీటీసీలు వార్డ్ మెంబర్ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని మండిపడారు.

హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ఎంపీటీసీలు

హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ఎంపీటీసీలు

తమకు నిధులు, విధులు ఏవీ లేవని, తమను ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎంపిటిసి లకు తక్షణ అభివృద్ధి నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే హుజురాబాద్ ఉప ఎన్నికలో బరిలోకి దిగి తమ సత్తా ఏమిటో ప్రభుత్వానికి అర్థమయ్యేలా చూపిస్తామని స్పష్టం చేశారు.ప్రస్తుతం జరుగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో తమకు కనీస మర్యాద దక్కడం లేదని, నిధులు లేనప్పుడు అసలు ఎంపీటీసీల వ్యవస్థ దేనికని ప్రశ్నిస్తున్నారు. ఎంపిటిసిలకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా కుర్చీలు లేని పరిస్థితులు, అవమానాలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు.ఎనిమిది వందల మంది ఎంపీటీసీలు హుజురాబాద్ ఎన్నికల బరిలో నిలుస్తామని తేల్చి చెప్పారు.

హుజురాబాద్ ఎన్నికల పోరులో మేము కూడా అంటున్న చేనేత కార్మిక కుటుంబాలు

హుజురాబాద్ ఎన్నికల పోరులో మేము కూడా అంటున్న చేనేత కార్మిక కుటుంబాలు

ఇక తాజాగా ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మిక కుటుంబాలు ప్రభుత్వం తమను ఆదుకోవడంలో ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తోంది అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ లో ఎన్నికల బరిలో దిగుతామని అంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధంగా ఉన్నామని ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల భార్యలు ప్రకటించారు.

నేత కార్మికులు చనిపోతే బాధిత కుటుంబానికి 10లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు .ఇప్పటి వరకు తమకు వితంతు పింఛన్ కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేనేత కార్మికుల పట్టించుకోకుంటే ముందు ముందు పోరు బాట పడతామని జాతీయ నేతన్నల ఐక్యకార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ వెల్లడించారు.

చనిపోయిన చేనేత కుటుంబాలను పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరిన చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ

చనిపోయిన చేనేత కుటుంబాలను పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరిన చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ

ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకు తాము అండగా ఉంటామని చెబుతూనే, ప్రభుత్వం పట్టించుకోకుంటే హుజురాబాద్ బరిలో నిలుస్తామని హెచ్చరించారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు పరిహారాన్ని జాతీయ చేనేత దినమైన ఆగస్టు 7వ తేదీ లోపు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉప ఎన్నికలు జరిగినా, హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమయంలో వస్తున్న చైతన్యం అంతా ఇంతా కాదు.

Recommended Video

    Spl Interview with bjp leader Enugu Ravindar Reddy on Etala Padayatra
    కేసీఆర్ కు బుద్ధి చెప్పటానికి రంగంలో దిగుతామంటున్న వివిధ వర్గాల ప్రజలు

    కేసీఆర్ కు బుద్ధి చెప్పటానికి రంగంలో దిగుతామంటున్న వివిధ వర్గాల ప్రజలు

    ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోరాటం సాగిస్తున్న ఎందరో హుజురాబాద్ బరిలో నిలిచి సీఎం కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాలను భర్తీ చెయ్యలేని కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి తగిన బుద్ధి చెప్తామని కొందరు నిరుద్యోగులు సైతం ఇప్పటికే వెల్లడించారు.

    గతంలో నిజామాబాద్ రైతులు పోటీ చేయడం వల్ల ఎంపీగా కవిత ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలు టార్గెట్ చేస్తూ విభిన్న వర్గాల వారి సమస్యలు తీర్చాలంటూ సీఎం కేసీఆర్ కు అల్టిమేటం జారీ చేస్తున్నారు లేదంటే ఎన్నికల బరిలో నిలిచి కెసిఆర్ కు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+