వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ లో మొదలైన హుజురాబాద్ పంచాయితీ; హై కమాండ్ దృష్టికి, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న కోమటి రెడ్డి

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీలో హుజురాబాద్ పంచాయితీ మొదలైంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కొందరు సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన గౌరవనీయమైన ఓటుబ్యాంకు వచ్చిందని, అక్కడ 20 వేలకు పైగా ఓట్లు వచ్చాయని పేర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, హుజురాబాద్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈటలకు కాంగ్రెస్ పరోక్ష మద్దతు; 30 వేల మెజార్టీతో ఈటల విజయం: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెన్సేషన్ !!

హుజురాబాద్ లో కాంగ్రెస్ కు చావుదెబ్బ .. రేవంత్ నాయకత్వంపై అసహనం

హుజురాబాద్ లో కాంగ్రెస్ కు చావుదెబ్బ .. రేవంత్ నాయకత్వంపై అసహనం

హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది .ఇంకా పూర్తి ఫలితాలు రానప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది అన్నది తాజా కౌంటింగ్ ట్రెండ్ ను బట్టి అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రథసారథి గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దూకుడుతో ముందుకు వెళుతుందని భావిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో సోదిలో లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి పగ్గాలు తీసుకున్న తర్వాత వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చాయని అందరూ భావిస్తే, ఈ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నట్టు స్పష్టంగా తెలియజేశాయి. రేవంత్ రెడ్డి నాయకత్వ సామర్ధ్యాన్ని వెక్కిరిస్తున్నాయి.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి


హుజురాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన బల్మూర్ వెంకట్ అసలు పోటీలోనే లేకుండా పోయారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థులతో, కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ పరిస్థితి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో ఒకింత అసహనం వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఏ మాత్రం ఛాన్స్ దొరికినా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికపై మరోమారు రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈ ఎన్నికల ఫలితాల పై హాట్ కామెంట్ చేశారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఒక్క సభ కూడా పెట్టలేదు

హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఒక్క సభ కూడా పెట్టలేదు

ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఈటలకు పరోక్షంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఐదు నెలలు అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించిన కోమటిరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక్క సభ కూడా పెట్టలేదని మండిపడ్డారు. ఇక గతంలో దుబ్బాక, నాగార్జునసాగర్ లో పని చేసినట్లుగా హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పని చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

హుజురాబాద్ లో కాంగ్రెస్ కు క్యాడర్ .. అయినా ఫెయిల్యూర్

హుజురాబాద్ లో కాంగ్రెస్ కు క్యాడర్ .. అయినా ఫెయిల్యూర్

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు పట్టించుకోకపోవడమే మొదటి ఫెయిల్యూర్ గా ఆయన అభివర్ణించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి గట్టి క్యాడర్ ఉందని అయినా ఆ కేడర్ ను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రయత్నం చేయలేదని ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

హుజురాబాద్ లో పరిస్థితి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా

హుజురాబాద్ లో పరిస్థితి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా

హుజురాబాద్ నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితిని హైకమాండ్ కు వివరిస్తానని, ఎన్నికల ఫెయిల్యూర్ ను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. తాను కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యకర్తలు అధైర్య పడొద్దు అని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాటలు ఇంకా ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏం సమాధానం ఇస్తాడో తెలియాల్సి ఉంది. ఇంకా ఎంతమంది రేవంత్ వ్యతిరేక వర్గం ఆయనను టార్గెట్ చేస్తారో తెలియాల్సి ఉంది.

English summary
Huzurabad fight started in Congress. Komatireddy Venkat Reddy revealed that he would explain the situation in Huzurabad to the High Command, targeting Revanth Reddy over the Congress' defeat in the Huzurabad by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X