దేశంలో తొలిసారిగా: శంషాబాద్ విమానాశ్రయంలో ఫేస్ రికగ్నిషన్ పద్ధతికి శ్రీకారం
హైదరాబాద్ : సేవల రంగంలో ఇప్పటికే వరసుగా రెండోసారి అవార్డు పొందిన హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో కొత్త సాంకేతికతకు తెరతీయనుంది. జీఎంఆర్ అధీనంలో నడుస్తున్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టు... వ్యక్తుల ముఖాలను గుర్తించే ప్రక్రియను విజయవంతంగా పరీక్షించింది. ముందుగా విమానాశ్రయంలోని ప్యాసింజర్ టర్మినల్ వద్ద ఈ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా సిబ్బందికి ముఖ గుర్తింపు పరీక్షలు చేశారు. ఇది సక్సెస్ అయ్యింది. దీంతో నియంత్రణ సంస్థలనుంచి క్లియరెన్స్ రాగానే ఇది ప్రయాణికులకు కూడా వర్తింపజేస్తామని జీఎంఆర్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా ఈ కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.
Recommended Video


ఫేస్ రికగ్నిషన్ సేవలు ఎలా వినియోగించుకోవాలి
ఇక ఫేస్ రికగ్నిషన్ సేవలు వినియోగించుకోవాలంటే ముందుగా ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌రోల్ అయ్యాక భవిష్యత్తులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లాలన్నా వెళ్లొచ్చు. నమోదు చేసుకునేందుకు టర్మినల్ ఎంట్రీ వద్ద కియోస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడే ప్రయాణికుల ముఖాన్ని, ప్రభుత్వంచే జారీ చేయబడ్డ గుర్తింపు కార్డులను రిజిస్టర్ చేస్తారు.

ఫేస్ రికగ్నిషన్ ఎలా పనిచేస్తుంది..?
ఫేస్ రికగ్నిషన్ ఎన్‌రోల్ అయిన ప్యాసింజర్ తన బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. సిస్టం బోర్డింగ్ పాస్ సమాచారాన్ని ఎయిర్‌లైన్స్ డిపార్చర్ కంట్రోల్ సిస్టంతో పోల్చి చూసుకుంటుంది. సమాచారం అంతా కరెక్ట్‌గా ఉందని వెరిఫై చేసుకోగానే... ప్రయాణికుడి ముఖం టికెట్‌పై మ్యాప్ అవుతుంది. ఇక మిగతా పాయింట్లు అంటే సెక్యూరిటీ, బోర్డింగ్ గేట్ దగ్గర ఫేస్ రికగ్నిషన్ యంత్రాలను ఉంచుతారు. అవి ముఖాన్ని గుర్తించగానే ప్రయాణికుడి వివరాలతో పాటు విమానంకు సంబంధించిన వివరాల సమాచారం అంతా సీఐఎస్ఎఫ్ లేదా ఎయిర్‌లైన్స్ కు చేరుతుంది.

ఫేస్ రికగ్నిషన్‌తో ఉపయోగం ఏమిటి..?
ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ అమలైతే ప్రయాణికుని యొక్కనిర్దుష్టత మరియు సౌలభ్యం రెండింటిలో మెరుగుదల కనిపిస్తుంది. ఇప్పటికైతే బార్ కోడ్ లేదా QR కోడ్ అమల్లో ఉంది. ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ దీనికి కొనసాగింపు అని చెప్పొచ్చు. దీని ఏర్పాటుకు అదనంగా కొంత మౌలిక సదుపాయాల నిర్మాణం అవసరమవుతుంది. ఇప్పటికే సిబ్బందిపై చేసిన పరీక్షలు విజయవంతం అవడంతో త్వరలోనే జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (GHAIL) భారత్‌లోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తోంది.
GHAIL ఈ బోర్డింగ్ సొల్యూషన్‌కు 2015లోనే BACSచే ధృవీకరించబడింది. ఆధార్ అనుసంధానం కూడా త్వరలోనే జరుగుతుంది. భవిష్యత్తులో రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ప్రయాణం అంతా పేపర్ రహితంగానే ఉంటుందని యుద్ధప్రాతిపదికన ప్రారంభించి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని అధికారి ఒకరు వెల్లడించారు. బయోమెట్రిక్ గుర్తింపు పద్ధతి వస్తే టికెట్, బోర్డింగ్ పాస్‌లకు కాలం చెల్లుతుందన్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications