గదిలో బంధించి, సింగపూర్‌లో హైదరాబాద్ వ్యాపారి హత్య, రూ.3 కోట్లు డిమాండ్
సింగపూర్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు కుషాయిగూడకు చెందిన వాసుదేవరావుగా గుర్తించారు.
హైదరాబాద్: సింగపూర్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు కుషాయిగూడకు చెందిన వాసుదేవరావుగా గుర్తించారు.
ఆయన కుషాయిగూడలో వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం పేరుతోనే దుండగులు ఆయనను సింగపూర్ రప్పించుకున్నారు. అక్కడకు వెళ్లాక ఆయనను ఓ గదిలో బంధించారు.

అనంతరం హైదరాబాదులోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సింగపూర్ నుంచి ఫోన్ చేశారు. వాసుదేవరావును మేం బంధించామని, అతనిని విడిచిపెట్టాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే అంతగా ఉన్నవాళ్లం కాదని, అంత ఇచ్చుకోలేమని బాధితులు చెప్పారు. ఈ మేరకు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేశారు. ఆ తర్వాత దుండగులు ఆయనను హత్య చేశారు. ఈ పని చేసింది సింగపూర్‌కు చెందినవారా, ఇక్కడి వారా తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications