Nehru Zoo park:హైదరాబాద్ జూపార్క్ తరలింపు..ఎక్కడికో తెలుసా..!!
Nehru Zoological Park:కొన్ని దశాబ్దాలపాటు ఇటు పిల్లల నుంచి వృద్ధుల వరకు అలరించిన నెహ్రూ జూలాజికల్ పార్కు ఇక హైదరాబాదులో కనిపించదా..? హైదరాబాదుకు తొలిసారి వచ్చేవారు కచ్చితంగా చూసే జూపార్కు ఇక ఆ ప్రాంతంలో ఉండదా..? జూపార్కు ప్రాంతం బోసిపోనుందా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ నెహ్రూ జూలాజికల్ పార్కు ఎక్కడికి తరలిస్తున్నారు..? దీని వెనక అసలు కారణం ఏంటి..
షాద్‌నగర్‌కు జూపార్క్ తరలింపు..?
ఆసియా ఖండంలో ఉన్న జూపార్కుల్లో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కచ్చితంగా టాప్ టెన్‌లో నిలుస్తుంది. ఇక్కడి జంతుప్రదర్శనశాల నిర్వహణ చాలా చక్కగా ఉంటుంది. హైదరాబాద్ పరిసరాల్లోని రాజేంద్రనగర్‌లో ఈ జూపార్కు ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పర్యాటకులు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కచ్చితంగా విజిట్ చేసే ప్రాంతం జూపార్క్. నెహ్రూ జూలాజికల్ పార్కులో 1,500 కంటే ఎక్కువ రకాల పక్షులు, జంతువులు, సరీసృపాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జూపార్కు ఉన్న చోట నుంచి షాద్‌నగర్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పలు కారణాలు వినిపిస్తున్నాయి.

జూపార్కు పరిసరాల్లో వాయుకాలుష్యం, శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు జూపార్కు సమీపంలోని మీర్ ఆలం ట్యాంక్ నుంచి వరద ఉధృతి పెరిగి జూపార్కులోకి నీరు ప్రవేశిస్తుండటంతో జూపార్కును మరోచోటికి తరలించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 380 ఎకరాల్లో విస్తరించి ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు 1963లో ప్రారంభమైంది.అంతకుముందు పబ్లిక్ గార్డెన్స్‌లో కొన్ని ఎంక్లోజర్లలో ఉండేది. సాధారణంగా జూపార్కులు నగర శివార్లలో ఉండేలా ఏర్పాటు చేస్తారు.ట్రాఫిక్, మరియు కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.
వరద రూపంలో పొంచి ఉన్న ప్రమాదం
1963లో హైదరాబాదులోని బహదూర్‌పురాలో జూపార్కును ఏర్పాటు చేశారు. అప్పుడు సిటీకి దూరంగా ఉండేది. అయితే కాలక్రమంలో హైదరాబాద్ నగరం నలుమూలల విస్తరించడం, ట్రాఫిక్ పెరిగిపోవడం, కాలుష్యం పెరగడం జరిగాయి. అంతేకాదు సమీప కాలనీల నుంచి డ్రైనేజీ నీరు మీర్ ఆలం ట్యాంక్ ప్రాంతంలోకి ప్రవేశించడం భారీ వర్షాలు కురిసిన సమయంలో జూపార్కులోకి ఇక్కడి నుంచి వరద నీరు ప్రవేశిస్తుండటంతో అక్కడి జంతువులకు ప్రాణసంకటంగా మారింది. ఇన్ని ఇబ్బందులతో అక్కడ జూపార్కును కొనసాగించడంపై ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు జూపార్కును ఖాళీ చేయిస్తే సిటీలో 380 ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది.
జూపార్కు తరలింపు వాస్తవం కాదు

జూపార్కు తరలి వెళ్లిపోతోంది అని వస్తున్న వార్తలను అటవీశాఖ సీనియర్ అధికారి కొట్టిపారేశారు. ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న జూపార్కును వేరే చోటికి తరలించడం సవాలుతో కూడుకున్న పని అని ప్రాక్టికల్‌గా అది సాధ్యపడే విషయం కాదని వివరించారు. గత 20 ఏళ్లుగా ఈ వార్తలు షికారు చేస్తున్నాయని చెప్పిన అధికారి...జూపార్కును మరో చోటికి తరలించాలంటే సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందని అదే సమయంలో జూపార్కు ఏర్పాటుకు భూమిని గుర్తించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
జూపార్కు మరో చోటికి తరలించడమంటే ఖర్చుతో కూడుకున్న పని అని అధికారి వివరించారు. ఒక్క టైగర్ ఎంక్లోజర్‌కు రూ.2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంతేకాదు ఈ జంతువులు ఆ ప్రాంతానికి అలవాటు పడేందుకు కనీసం ఐదేళ్ల సమయం పడుతుందని అన్నారు. ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ఇది పెనుసవాలుతో కూడుకున్నదని జూపార్కు తరలింపు ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే పని కాదని వెల్లడించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications