మత్తుమందిచ్చి మైనర్ బాలికపై అత్యాచారం, సహకరించిన పక్కింటి మహిళ

కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలికపై అత్యాచారానికి పక్కింటి మహిళ సహకరించింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

హైదరాబాద్: కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలికపై అత్యాచారానికి పక్కింటి మహిళ సహకరించింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

హైద్రాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది. మాచపోతు అలివేలు అనే వివాహిత వద్ద పక్కనే నివాసం ఉండే దంపతులు తమ 13 ఏళ్ళ కూతురును వదిలివెళ్ళారు. బాలిక తల్లిదండ్రులు బొమ్మలు విక్రయించి జీవనం సాగిస్తారు.

అయితే వారు శుక్రవారం నాడు ఉదయం వెళ్ళి శనివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చారు.అయితే వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి అలివేలు ఇంటి వద్ద ఉన్న తమ కూతురు అనారోగ్యంగా కన్పించింది. ఈ విషయమై బాలికను వాకబు చేస్తే అసలు విషయం వెలుగుచూసింది.

Hyderabad: Neighbour helps stranger rape girl

శుక్రవారం నాడు మధ్యాహ్నం ఓ కొత్త వ్యక్తితో కలిసి అలివేలు ఇంటికి వచ్చిందని బాలిక తెలిపింది.అయితే వారు సమీపంలోని కల్లు దుకాణంలోకి వెళ్ళి కల్లు తాగి వచ్చారని బాలిక చెప్పింది.

అయితే ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి బాలికకు తాగించారు. స్పృహ కోల్పోయే పరిస్థితిలో బాలిక ఉండగానే అలివేలు ఇంటి బయట నుండే తాళం వేసి బయటకు వెళ్ళింది.

బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్ది సేపటి తర్వాత అలివేలు ఇంటి తాళం తీసింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరో వైపు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+