• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తిరుపతిరావు కమిటీ కలకలం: ఫీజు ఏటా 10 శాతం పెంపు... నెలన్నర ఆలస్యమైతే టీసీ!

By Ramesh Babu
|

హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై కేసీఆర్ సర్కారు నియమించిన తిరుపతిరావు కమిటీ ఎట్టకేలకు శనివారం తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలోని సిఫార్సులు విద్యార్థులు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పెరిగెట్టిస్తున్నాయి.

ఏటా 10 శాతం మేర పాఠశాల ఫీజును యాజమాన్యాలే పెంచుకోవచ్చని, అంతకుమించితే మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, ఒకవేళ ఫీజు చెల్లింపు 45 రోజులు ఆలస్యమైతే.. విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించే హక్కు పాఠశాల యాజమాన్యానికి ఇవ్వాలని ఈ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

మండిపడుతున్న పేరెంట్స్ అసోసియేషన్స్...

మండిపడుతున్న పేరెంట్స్ అసోసియేషన్స్...

దాదాపు 9 నెలలుగా పలు విద్యా సంస్థలతో చర్చించిన తిరుపతిరావు కమిటీ చేసిన సిఫార్సులపై పేరెంట్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు మండిపడుతున్నారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు తలొగ్గి ఈ నివేదిక తయారుచేసినట్లు ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు తిరుపతిరావు కమిటీ తన నివేదికలో ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి మరికొన్ని సిఫార్సులు కూడా చేసింది. పాఠశాలల అడ్మిషన్లు ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే జోనల్ విధానంలో ఫీజు రెగ్యులేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

సకాలంలో ఫీజులు చెల్లించరు.. నిర్వహణ ఎలా?

సకాలంలో ఫీజులు చెల్లించరు.. నిర్వహణ ఎలా?

మరోవైపు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంఘాలు తిరుపతిరావు కమిటీ నివేదికపై హర్షం వ్యక్తం చేశాయి. నిజానికి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ఇన్నాళ్లకు తమ బాధ, ఆవేదనను తిరుపతిరావు కమిటీ అర్థం చేసుకుందని వ్యాఖ్యానించాయి. కార్పొరేట్ స్కూళ్ల సంగతి పక్కన పెడితే.. రాష్ట్రంలో చిన్న చిన్న స్కూళ్లు ఎన్నో ఉన్నాయని, తల్లిదండ్రులు సకాలంలో పిల్లల స్కూలు ఫీజు చెల్లించకపోవడంతో స్కూళ్ల యాజమాన్యాలు నిర్వహణాపరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాయి. తల్లిదండ్రులు ఫీజులు సకాలంలో కట్టకపోతే పాఠశాలల నిర్వహణకు అవసరమైన ధనాన్ని తామెక్కడ్నించి సమకూర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నాయి.

ప్రశ్నిస్తే.. తల్లిదండ్రులు బ్లాక్‌మెయిలింగ్?

ప్రశ్నిస్తే.. తల్లిదండ్రులు బ్లాక్‌మెయిలింగ్?

స్కూలు ఫీజు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తే.. తల్లిదండ్రులు తిరగబడుతున్నారని, స్కూళ్ల యాజమాన్యాలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని పలువురు ప్రైవేటు స్కూళ్ల యజమానులు ఆరోపిస్తున్నారు. సమస్యను వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసం గోరంతను కొండంతగా చిత్రీకరించి ఏకంగా మీడియాను స్కూళ్లకు తీసుకొచ్చి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని, సహజంగానే నెగెటివ్ వార్తల పట్ల ఆసక్తి ప్రదర్శించే మీడియా కూడా వాస్తవాలను విస్మరించి తల్లిదండ్రుల పక్షానే నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేటగిరైజేషన్ చేయమని అడిగాం...

కేటగిరైజేషన్ చేయమని అడిగాం...

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు స్కూళ్లనే ఎత్తివేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, నిజానికి ఫీజుల పేరిట ప్రైవేటు స్కూళ్లన్నీ తల్లిదండ్రులను దోచుకోవడం లేదని, ఆ కేటగిరీ స్కూళ్లు వేరని, కానీ తల్లిదండ్రులు మాత్రం అన్నింటినీ ఒకే గాటిన కట్టేసినట్లు తమపై ఒకరకమైన ముద్ర వేశారని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రైవేటు స్కూళ్లను వాటి స్థాయిలను బట్టి కేటగిరైజేష్ చేయమని కూడా తాము ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను ఎన్నోమార్లు కోరామని తెలిపారు. పెట్రోలు, డీజిలు, బంగారం, నిత్యావసరాల ధరలు ఎంత పెరిగినా విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనలు నిర్వహించరని, స్కూలు ఫీజులు పెంచితే మాత్రం రోడ్డెక్కుతారని, ఇదెక్కడి న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు.

తక్కువ ఫీజు ఉన్న స్కూళ్లలో చేరొచ్చు కదా?

తక్కువ ఫీజు ఉన్న స్కూళ్లలో చేరొచ్చు కదా?

వాస్తవానికి ప్రతి ప్రవేటు స్కూళు లక్షల రూపాయలు తీసుకోవడం లేదని, ఏడాదికి అన్నీ కులుపుకుని రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్యలో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయని యాజమాన్యాల సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి ఎంత ఖర్చు చేస్తుందో కనీసం అంత కట్టినా చాలనికూడా తాము కోరామని చెబుతున్నాయి. ఒకవేళ హెచ్‌పీఎస్, మెరిడియన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తదితర కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు భారం అధికమైతే.. పిల్లల్ని అక్కడే చదివించాలనే నిబంధన ఏదీ లేదని, తల్లిదండ్రులు తక్కువ ఫీజు వసూలు చేసే ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించుకోవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నాయి.

English summary
Professor Tirupathi Rao committee on School Fee in Private Schools submitted its long-pending report on Saturday to the Government of Telangana. But the Parents Associations alleged that all recommendations made by the committee were in favour of the state government and the private education sector. The report advised school managements to go to the Fee Regulatory Committee only if they wanted a fee increase of more than 10 per cent. As per the committee recommendations, If a student delays paying the fee by more than 45 days he or she can be given a transfer certificate by the school management. The Hyderabad School Parents Association and Telangana Parents Association opposed the 10 per cent annual fee hike proposed by the Prof. Tirupathi Rao committee, to be implemented for the upcoming academic year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X