హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణమంటే ఇదే: ఉప్పుకు కూడా బిల్లు వేసిన రెస్టారెంట్!

ఏదైనా హోటల్‌కి వెళ్లి ఆహారం తింటే దానికి బిల్లు కడతారు. కొంటే వాటర్ బాటిల్‌కు కడతారు... కానీ, ఆహారంలో వేసుకునే చెంచాడు ఉప్పుకు కూడా బిల్లు కట్టడం ఎక్కడైనా చూశారా? ఇక్కడ మాత్రం ఓ వినియోగదారుడికి అది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏదైనా హోటల్‌కి వెళ్లి ఆహారం తింటే దానికి బిల్లు కడతారు. కొంటే వాటర్ బాటిల్‌కు కడతారు... కానీ, ఆహారంలో వేసుకునే చెంచాడు ఉప్పుకు కూడా బిల్లు కట్టడం ఎక్కడైనా చూశారా? ఇక్కడ మాత్రం ఓ వినియోగదారుడికి అది తప్పలేదు. ఓ హోటల్ నిర్వాకంతో వినియోగదారుడు ఆశ్చర్యానికి గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి సోమాజిగూడలో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌కు కుటుంబసమేతంగా డిన్నర్‌కు వెళ్లాడు. భోజనం తర్వాత సోడాలోకి కొంచెం ఉప్పు కావాలని అడిగాడు. దీంతో ఉప్పు అందించారు హోటల్ సిబ్బంది.

Hyderabad: Restaurant charges Re 1 for salt

అంతేగాక, చివరగా వినియోగదారుడికి ఇచ్చిన బిల్లులో ఆ చెంచాడు ఉప్పుకు కూడా రూ.1 ఛార్జీ వేశారు. దీంతో ఆ వినియోగదారుడు కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఉప్పుకు బిల్లేయడం ఎక్కడా చూడలేదనుకున్నాడు. కాగా, ఈ ఉప్పు ఛార్జీ విషయంపై సదరు రెస్టారెంట్ యాజమాన్యం స్పందించింది.

ఈ సంఘటన కావాలని చేసింది కాదని.. సాఫ్ట్ వేర్‌లో తప్పిదం వల్లే జరిగిందని తెలియజేసింది. తాజాగా బిల్లు ఇచ్చే యంత్రాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశామని, దీన్ని గమనించకుండా క్యాషియర్ బిల్లు జారీ చేశాడని చెప్పుకొచ్చింది. కాగా, వినియోగదారుడిని ప్రసన్నం చేసుకునేందుకు లైమ్ సోడాకు రేటు రూ.150 తగ్గింపు ఇచ్చింది. అయితే, దాన్ని సదరు వినియోగదారుడు నిరాకరించాడు.

English summary
A pinch of salt is chargeable literally. A new plush restaurant cum-bar charged a customer for the extra salt he requested. Avinash Sethi (name changed) was dining out with his family when he asked for some salt for the lime soda. Little did he realise that it would be added in the bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X