Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ TO కొచ్చి.. తక్కువ ధరకే అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ..

కేరళ అందాలు చెప్పాలంటే మాటలు చాలవు. దేశంలోని అత్యంత సుందరమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో కేరళ ఒకటిగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో ఉన్న సహజమైన ప్రకృతి అందాలు మరే రాష్ట్రంలోనూ మనకు కనిపించవు. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తుంటారు. పర్యటకులకు స్వర్గధామంగా ఇక్కడి ప్రదేశాలు కనువిందు చేస్తాయి. ఇక వేసవిలో ఎక్కువ మంది పర్యటకులు కేరళను సందర్శించేందుకు ఇష్ట పడుతుంటారు. ఇక్కడి టీ, కాఫీ తోటలు, కొండలు, కోనలు, జలపాతాలు, ఘాట్ రోడ్లు.. ఒక్కటేమిటి అన్నీ పర్యటకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి.

అయితే కేరళలోని కొచ్చి ప్రదేశం పర్యటకులకు స్వర్గధామంగా ఉంటుంది. కొచ్చి ప్రాంతాన్ని అరేబియా సముద్రపు రాణి అని పిలుచుకుంటారు. కేరళలోని కొచ్చిలో చారిత్రక ఫోర్ట్, బ్యాక్ వాటర్స్, సుగంధ ద్రవ్యాల తోటలు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇక్కడి ప్రకృతి అందాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు టూరిస్టులకు కొత్తగా అనిపిస్తాయి. ఇక హైదరాబాద్ నుంచి కొచ్చి టూర్ తక్కువ ధరలోనే ముగించుకోవచ్చు. ప్లాన్ చేసుకుంటే చాలు భాగ్యనగరం నుంచి కొచ్చి టూర్ ఈజీగా పూర్తి అవుతుంది.

హైదరాబాద్ నుంచి కొచ్చి విమాన మార్గంలో వెళ్తే గంటన్నరలో చేరుకోవచ్చు. విమాన ప్రయాణం ఖర్చు రూ. 3000 నుంచి రూ. 7000 వరకు ఉంటుంది. ఇక ముందుగా బుకింగ్ చేసుకున్నవారికి ఖర్చు చాలా తక్కువగానే ఉంటుంది. ఇక రెండో ఆప్షన్.. రైలులో ప్రయాణిస్తే 22 నుంచి 24 గంటల్లో కేరళలోని కొచ్చి చేరుకోవచ్చు. ఇక రైలు ప్రయాణం ఖర్చు కేవలం రూ. 600 నుంచి రూ. 2000 మధ్యలో ఉంటుంది. ఇక మూడో మార్గం రోడ్డు మార్గం ద్వారా బస్సులో ప్రయాణిస్తే 15 గంటల్లో కొచ్చి చేరుకోవచ్చు. రూ. 3000 వరకు టికెట్ ఖర్చు అవుతుంది.

Hyderabad to Kochi Scenic Beauty Expedition Grab This Incredible Affordable Tour Package Now

కొచ్చిలో చాలా ప్రదేశాలు మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి. కొచ్చి ఫోర్ట్ చాలా ఫేమస్. ఇది ఒక చారిత్రక సముద్ర తీర పట్టణం. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ పాలనలో ప్రత్యేకమైన వారసత్వాన్ని కలిగిఉంది. ఈ ప్రదేశం పర్యటకులకు, ప్రకృతి ప్రేమికులకు, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునేవారికి బెస్ట్ ప్లేస్ గా చెబుతారు. ఇక రెండోది మట్టంచేరి ప్యాలెస్.. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ ప్రభుత్వం ఈ చారిత్రకమైన ప్యాలెస్ ను నిర్మించింది. అయితే ఆ తర్వాత ఈ కోటకు డచ్ ప్యాలెస్ అని పేరు వచ్చింది. పర్యటకులు ఈ ప్యాలెస్ ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించే అవకాశం ఉంది. అలాగే కొచ్చిలో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి.. ఇక్కడే మెరైన్ డ్రైవ్, చెరై బీచ్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతాల్ని తనివితీరా ఆస్వాధించొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+