హైదరాబాద్ లో 5 ఫేమస్ గార్డెన్ కేఫ్‌లు ఇవే.. వీటి ప్రత్యేకతల గురించి తెలుసా..?
హైదరాబాద్ లో వీకెండ్ టూరిజం ఊపందుకుంది. వారం మొత్తం వర్క్ లైఫ్ లో బిజీగా ఉన్న ఉద్యోగులు వారాంతంలో దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లో గార్డెన్ కేఫ్ లు ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తున్నాయి. నగరంలోని అనేక మంది తమ పిల్లలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సరదాగా ఇక్కడకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.
హైదరాబాద్ అంటే సాఫ్ట్ వేర్ సంస్థలు, టెక్ కంపెనీలు, ఫార్మసీ కంపెనీలు, ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్స్, చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. కానీ ఇటీవలికాలంలో ఐటీ హబ్ మాత్రమే కాదు.. గ్రీన్ కేఫ్ సంస్కృతికి కొత్త కేంద్రంగా కూడా హైదరాబాద్ మారుతోంది. ఇప్పుడు నగర వాసుల కోసం కొత్తగా గార్డెన్ కేఫ్ లు ఏర్పాటు అవుతున్నాయి. ఇవి బిజీ ప్రపంచానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా కనువిందు చేస్తాయి. జూబ్లీ హిల్స్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఈ 5 గార్డెన్ కేఫ్ లు ఇప్పడు అందరికీ హాట్ స్పాట్ గా మారిపోయాయి.
జూబ్లీ హిల్స్ లోని అర్బన్ నెమో కేప్ ఇప్పుడు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున ఉన్న ఈ కేప్ లో అద్భుతమైన అక్వేరియం, చెక్క ఫర్నిచర్ ,ఇండోర్ మొక్కలు కనువిందు చేస్తాయి. ఇక్కడ పాస్తా, బర్గర్లు , సిగ్నేచర్ కోల్డ్ కాఫీ ఉంటాయి. లవర్స్, స్టూడెంట్స్, కపుల్స్ కు ఫేవరేట్ స్పాట్ అని చెప్పొచ్చు.
జూబ్లీ హిల్స్ పరిధిలోని హౌస్ ఆఫ్ గౌర్మెట్ కేప్.. చాలా వినూత్నంగా ఉంటుంది. ఈ కేప్ డెకరేషన్ ఓ పాత తోటను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పూల కుండీల లైన్ తో పాటు డిమ్ లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. ఇక్కడి ఫారిన్ వంటకాలు , క్రీమీ చీజ్ కేక్ లు అద్భుతంగా ఉంటాయి. గ్రానో కాఫీ అఫైర్స్.. ఈ కేప్ లో వుడెన్ ఫర్నీచర్, నేచురల్ గ్రీనరీ, మోడ్రన్ ఇంటీరియర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇక్కడ చెక్కలపై కాల్చిన పిజ్జాలతో పాటు అద్భుతమైన కాఫీలు స్పెషల్ గా ఉంటాయి.

ఇక హైదరాబాద్‌లో యూరోపియన్ అనుభూతిని పొందాలంటే సోబ్రేమేసా కేప్ ను సందర్శించాల్సిందే. ఈ కేఫ్ లో రాత్రిపూట స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. ఈ కేప్ లో అల్పాహారం ప్లాటర్లు , రిఫ్రెషింగ్ పానీయాలతో యూరోపియన్ వైబ్ ను కలిగిస్తాయి. అలాగే మాదాపూర్ లోని బ్రూ బైట్ బిస్ట్రో కేప్ కూడా హైదరాబాద్ వాసులను ఆకర్షిస్తోంది.












Click it and Unblock the Notifications