కారులో సేల్స్ గర్ల్‌పై రేప్: అన్నయ్య చూశాడు, ముగ్గురు వీరే

హైదరాబాద్: హైదరాబాదులో సమీపంలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ వద్ద ఓ సేల్స్ గర్ల్‌పై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న 21 ఏళ్ల యువతిని ముగ్గురు కిడ్నాప్ చేసి, ఆమెపై కారులో అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒకతను తాగి ఉండడం వల్ల వెంటనే పట్టుబడినట్లు చెబుతున్నారు.

ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేస్తున్న సంఘటనను అన్నయ్య చూసి, స్థానికులను అప్రమత్తం చేశాడని అంటున్నారు. దాంతో నిందితులు పట్టుబడినట్లు సమాచారం. తాము తాగి ఉన్నామని, ఆ యువి తమకు తెలుసునని నిందితులు చెబుతుండగా వారెవరో తనకు తెలియదని యువతి చెబుతోంది.

Hyderabad: Trio on the run arrested for rape

ఆ ముగ్గురు వీరే....

అత్యాచారం కేసులో అనుమానితుల్లో ఒకతను మధగోని ప్రసాద్ (24). అతను కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎల్బీనగర్‌లోని భరత్‌నగర్ నివాసి. రెండో వ్యక్తి సిద్దగోని శివకుమార్ (25). హైదరాబాదులోని అల్కాపురికి చెందినవాడు. పరిగి మల్లేష్ (25). న్యూస్ పేపర్ ఏజెంటు అయిన ఇతను సరూర్‌నగర్‌లోని రాజీవ్ గాంధీ నగర్‌కు చెందినవాడు

అమ్మాయిని తాను చాలాసార్లు చూశానని, ఆ అమ్మాయి పనిచేస్తున్న సూపర్ మార్కెట్‌కు తన మిత్రుడి కోసం వెళ్లినప్పుడు తాను ఆమెను చూశానని ప్రసాద్ చెప్పినట్లు హయత్‌నగర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జె. నరేందర్ గౌడ్ చెప్పారు.

దీపావళి పర్వదినం రోజు వేడుకల్లో భాగంగా వారు తాగి, అమ్మాయి నివసించే ప్రాంతానికి కారులో వెళ్లి, ఆమె వచ్చేవరకు వేచి చూసినట్లు చెబుతున్నారు. అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకోవాలని ప్రసాద్ భావించాడని, దాంతో తాగిన తర్వాత మిత్రులతో కలిసి ప్లాన్ చేసి అమ్మాయిని కిడ్నాప్ చేసి, పెద్ద అంబర్‌పేటలోని నిర్మానుష్యమైన ప్రదేశంలో అత్యాచారం చేశారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+