ఫేస్‌బుక్‌లో ‘సారీ’ చెప్పి.. టీవీ ఛానల్ ఎడిటర్ ఆత్మహత్య
ఓ టీవీ ఛానల్‌లో ఎడిటర్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో ముందుగానే సమాచారమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: ఓ టీవీ ఛానల్‌లో ఎడిటర్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో ముందుగానే సమాచారమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నగరంలోని మోతీనగర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆర్ రాజేష్ చౌదరి(32) అనే వ్యక్తి జీ టీవీ తెలుగు ఛానల్‌లో డెస్క్ ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. ఖమ్మంలోని జానకీపురంకు చెందిన రాజేష్.. నగరంలోని మోతీనగర్‌లో నివాసముంటున్నాడు. కాగా, రాజేష్ తల్లి, సోదరుడు అతని చిన్నతనంలోనే చనిపోయారు. అతని సొంత గ్రామంలో తండ్రి ఉంటున్నాడు.
ఈ క్రమంలో రాజేష్ తను ఒంటరివాడినయ్యానంటూ తనలో తాను బాధపడుతుండేవాడు. కాగా, రాజేష్ ఆత్మహత్య చేసుకునే ముందు ఫేస్‌బుక్‌లో రెండు పోస్టులు పెట్టాడు. 'మీ అందర్నీ మిస్ అవుతున్నా.. నన్ను క్షమించాలి' అని పోస్ట్ చేశాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తెలిపాడు.

తాను ఒంటరిగా ఉన్నాననే భావన తనను వేధిస్తోందని, అందుకే తన తల్లి దగ్గరికి వెళ్తున్నట్లు తెలిపాడు. తాను పుట్టేటప్పుడు ఒక్కడినే జన్మించలేదని, తనతోపాటు తన చావు కూడా పుట్టిందని ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించాడు రాజేష్. ఆ తర్వాత తన గదిలోనే సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, ఫేస్‌బుక్‌లో రాజేష్ పోస్ట్ చూసిన అతని స్నేహితులు.. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. అతనుండే నివాసానికి చేరుకుని, ఇంటి యజమాని, చుట్టుపక్కల వారికి విషయం తెలిపారు. అతని గదికి వెళ్లి చూడగా అప్పటికే రాజేష్ విగత జీవిగా పడివున్నాడు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
రాజేష్ ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడుతుండేవాడని, అతడికి ఇంకా పెళ్లి కాలేదని స్నేహితులు తెలిపారు. రాజేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అతని తండ్రికి అప్పగించారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications