హైడ్రా కూల్చివేతల లిస్టు - జాబితాలో..!!

హైడ్రా కూల్చివేతల సంఖ్య పెరుగుతోంది. చెరువులు, నాళాలు ఆక్రమించిన వారిని వదిలేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ హెచ్చరించారు. హైడ్రా పని తీరు పైన ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హైడ్రా మాత్రం చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చివేయటం కొనసాగిస్తోంది. సామాన్య ప్రజలు ఇప్పటికే ఉన్న నిర్మాణాలను మాత్రం కూల్చివేయమని స్పష్టం చేసింది. అదే సమయంలో హైడ్రా తాజాగా నగరంలోని పలు చెరువుల్లో దాదాపు 111 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఆ లిస్టును హైడ్రా అధికారులు విడుదల చేసారు.

111 ఎకరాలు స్వాధీనం
హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా సంచలనంగా మారుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఆక్రమణల పై నోటీసులు జారీ చేసింది. హెచ్చరికలు చేసినా నిర్మాణాలు చేస్తున్న వాటిని కూల్చి వేస్తోంది. తాజాగా.. హైడ్రా మరో నివేదిక విడుదల చేసింది. ఇప్పటివరకూ మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు ఈ నివేదికలో పేర్కొంది. అత్యధికంగా అమీన్ పూర్ లేక్ 51.78, బుమ్రాక్ డౌలా12, సున్నం చెరువు 10, గండిపేట్ లేక్ 8.75, గండిపేట్ చిల్కూర్ 6.5 ఎకరాలతో పాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.

HYDRA releases demolitions list of 111 acres in the city

262 నిర్మాణాలు కూల్చివేత
హైడ్రా ఇప్పటి వరకు మొత్తం 262 నిర్మాణాలు కూల్చివేయగా.. ఒక్క అమీన్‌పూర్ చెరువులోనే 51.78 ఎకరాల్లో 24 నిర్మాణాల కూల్చివేసింది. సున్నం చెరువులో 10 ఎకరాలు రికవరీ చేసింది. సున్నం చెరువులో 42 నిర్మాణాలు కూల్చివేయగా.. కత్వా చెరువు FTL, బఫర్‌జోన్‌లో 2.5 ఎకరాలు రికవరీ అయింది. కత్వా చెరువులో 13 విల్లాలు కూల్చివేసింది. గండిపేట్ చెరువులో 8.75 ఎకరాలు రికవరీ చేయగా.. గండిపేట్ లేక్‌లో చిలుకూరు వద్ద మరో 6.5 ఎకరాలు, తుమ్మిడికుంట చెరువులో 4.9 ఎకరాలు రికవరీ చేసినట్లు హైడ్రా వెల్లడించింది.

తేల్చి చెప్పిన రేవంత్
ఇక సీఎం రేవంత్ సైతం ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసేది లేదని తేల్చి చెప్పారు. ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయని, వరదలు వస్తే పేదల ఇళ్లు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని, ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోండని సూచించారు. ఆక్రమణలను కూల్చే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతామని రేవంత్​రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+