శోభితా పై ట్రోల్స్..అండగా మహిళా సంఘాలు..!!
గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని పాతకాలపు నానుడి ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి కొత్తగా వచ్చి చేరుతుంటే అలాంటి వారి ఎంట్రీతో శుభం జరిగితే వాళ్ల వలన శుభం జరిగిందని, అశుభం జరిగితే వాళ్ల వల్లనే అశుభం జరిగిందని చెప్పుకోవడం గతంలో ఉంది. ఇక తాజాగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సమయంలో కూడా అలాంటి చర్చలు జరగటం మనం ఎక్కడున్నాం అన్న చర్చకు కారణం అవుతుంది.
పాపం .. శోభిత ధూళిపాళ
కొత్త కోడలుగా అక్కినేని ఇంట అడుగు పెట్టాలని శోభిత దూళిపాళ్ల నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న వేళ నుండి ఆమె పైన ట్రోలింగ్స్, వేణు స్వామీ షాకింగ్ జాతకం బయటకు వచ్చాయి. అప్పుడే మహిళాలోకం భగ్గుమంది. వేణుస్వామిపై మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలకు మహిళా కమీషన్ కూడా సిద్ధమై వేణు స్వామికి సమన్లు పంపి వివరణ అడిగింది.

ఆందోళన కలిగిస్తున్న చర్చ
గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జున ఒక ఆస్తి విషయంలో ఇంతగా ఇబ్బంది పడడం నాగార్జున జీవితంలోనే తొలిసారి. అయితే దానికి కారణం శోభిత కానే కాదు అన్నది ఇప్పటి మహిళల వాదన. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు మన సమాజంలో ఉన్న పాతకాలం నాటి అపోహలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెంది ముందుకు దూసుకు వెళుతున్న నేటి రోజుల్లోనూ ప్రజలలో కనిపించడం ఒకింత ఆందోళన కలిగించే అంశం.
హైడ్రా చర్యలతో కాదు జనం చర్చలతో నష్టం
నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అది చెరువులో కట్టిన అక్రమ నిర్మాణం అని హైడ్రా గుర్తించి జరిపిన కూల్చివేత. అది ఆక్రమణ కాదని నాగార్జున కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. దానిని అదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అయితే దానిని శోభిత దూళిపాళ్ల తో ముడిపెట్టడం దారుణం. ఇలాంటి వారిపై శోభిత చట్టపరంగా చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నట్టు సమాచారం.
హైడ్రా షాక్ నాగార్జునకు.. కానీ
సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ తీసుకున్న నిర్ణయం నాగార్జునకు నష్టం చేస్తే అసలు నష్టం జరిగిందంతా శోభిత వల్లేనంటూ చర్చించటం అన్యాయం. ఇక కొందరైతే సమంతను ఈ వ్యవహారంలో చేర్చి ఇబ్బంది పెడుతున్నారు. ఈ చర్యతో ఇద్దరు ఆడవాళ్ళ గురించి, సినీ సెలబ్రిటీలు అయిన కారణంగా చర్చ జరగటం బాధాకరం. దీంతో హైడ్రా షాక్ నాగార్జునకే కాదు శోభిత కు కూడా.. అని ఆమెపై జనాల్లో సింపతీ పెరుగుతుంది.
శోభితకు మద్దతుగా మహిళాలోకం
ఏది ఏమైనా హైడ్రా కూల్చివేతలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న శోభిత ధూళిపాళ గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చతో మహిళాలోకం ఆమె వైపే నిలిచింది..ఈ పరిస్థితి మారాలని నేటి మహిళ కోరుతోంది. ఏది జరిగినా ఆడవాళ్ళను టార్గెట్ చేసే వ్యవస్థలో మార్పు రావాలని కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications