ప్రాణమున్నంతవరకు పాట ఆపను: గద్దర్(పిక్చర్స్)
హైదరాబాద్: తన ఊపిరి వున్నంత కాలం తన పాటను ఇలాగే కొనసాగిస్తానని ప్రజా యుద్ధనౌక గద్దర్ తెలిపారు. శబ్ధం కళాకారుల, రచయితల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘పాటనై వస్తున్నానమ్మో' పేరిట గద్దర్ పాటపై తూటా కార్యక్రమం సుందరయ్య కళానిలయంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా గద్దర్, ప్రజా కళాకారులు ఆడిపాడారు.
అనంతరం గద్దర్ మాట్లాడుతూ.. శభ్ధాన్ని ఎవరూ ఉరితీయలేరని, జైల్లోనూ వేయలేరని అన్నారు. తనపై కాల్పులు జరిగి 18ఏళ్ల గడిచినా దుండగులు ఎవరో కనిపెట్టలేకపోయారన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు హయాంలో, కాంగ్రెస్ పాలనలోనూ తనపై అనేక దాడులు జరిగాయన్నారు. చాలా సార్లు అరెస్ట్ చేశారని చెప్పారు. లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయని అన్నారు.
ఇప్పటికీ తనకు రాత్రి సమయంలో ఆగంతకుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ హత్యలను అరికట్టనంత కాలం ప్రజా కళాకారులపై నిర్బంధకాండ కొనసాగుతుందన్నారు. పాలకులు కళాకారులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ప్రలు కోరుకున్న తెలంగాణ కోసం ఆరు నెలలపాటు ఊరూరా తిరిగి ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు.

గద్దర్
తన ఊపిరి వున్నంత కాలం తన పాటను ఇలాగే కొనసాగిస్తానని ప్రజా యుద్ధనౌక గద్దర్ తెలిపారు.

గద్దర్
శబ్ధం కళాకారుల, రచయితల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘పాటనై వస్తున్నానమ్మో' పేరిట గద్దర్ పాటపై తూటా కార్యక్రమం సుందరయ్య కళానిలయంలో సోమవారం రాత్రి జరిగింది.

గద్దర్
ఈ సందర్భంగా గద్దర్, ప్రజా కళాకారులు ఆడిపాడారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ.. శభ్ధాన్ని ఎవరూ ఉరితీయలేరని, జైల్లోనూ వేయలేరని అన్నారు.

గద్దర్
తనపై కాల్పులు జరిగి 18ఏళ్ల గడిచినా దుండగులు ఎవరో కనిపెట్టలేకపోయారన్నారు.

గద్దర్
మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు హయాంలో, కాంగ్రెస్ పాలనలోనూ తనపై అనేక దాడులు జరిగాయన్నారు. చాలా సార్లు అరెస్ట్ చేశారని చెప్పారు. లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయని అన్నారు.

గద్దర్
ఇప్పటికీ తనకు రాత్రి సమయంలో ఆగంతకుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ హత్యలను అరికట్టనంత కాలం ప్రజా కళాకారులపై నిర్బంధకాండ కొనసాగుతుందన్నారు.

గద్దర్
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజాగాయకురాలు విమలక్క కలసి గద్దర్‌కు లాఠీ, నల్లగొంగడి, గజ్జెలు, చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల ఆటపాటలు అలరించాయి.

గద్దర్
కార్యక్రమంలో పాశం యాదగిరి, బండ్రు నర్సింహులు, సంఘంరెడ్డి సత్యనారాయణ, సియాసత్ సంపాదకులు జాహెర్ అలీఖాన్, జేబీరాజు, సాంబశివరావు, దరవు అంజయ్య, జయరాజు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications