వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఆ పనిచేస్తే.. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇక పోటీ చేయను: కోమటిరెడ్డి రాజగోపాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి. చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. వరదల సమయంలో కరోనా రావడంతో చౌటుప్పల్‌కి రాలేకపోయానని తెలిపారు.

ఆ మూడు నియోజకవర్గాలకే అభివృద్ధి: కోమటిరెడ్డి..

ఆ మూడు నియోజకవర్గాలకే అభివృద్ధి: కోమటిరెడ్డి..

గత ఏడాది కూడా వర్షాలకు చెరువులు నిండి అలుగు వరదతో జాతీయ రహదారిపై వరద రావడం జరిగిందని, దీనికి శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ల లంటే ముఖ్యమంత్రి సమయం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మునుగోడు నియోజక వర్గం సమస్య లపై అసెంబ్లీలో కూడా గళం ఎత్తినా లాభం లేదన్నారు. నిధులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వ పెద్దలలో వున్న సంబంధాలతో దివిస్ కంపెనీ లో స్థానికుల కు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట నియోజక వర్గాలలో తప్ప రాష్ట్రం లో ఎక్కడ అభివృద్ధి జరగడం లేదని కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులపై, అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్షం చేస్తుందని ఆరోపించారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై వివక్ష

ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై వివక్ష

చౌటుప్పల్ మున్సి పాలిటి‌కి మున్సిపల్ మంత్రి కేటీఆర్ వెంటనే 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. చౌటుప్పల్ టూ తంగడిపల్లి వెళ్ళే మార్గంలో వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వున్న చోట నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎలాగు ఇవ్వరు కాబట్టి ఇల్లు లేని ప్రతి పేద వాడికి ఇంటి స్థలం వుంటే రెండున్నర లక్షల రూపాయల ఇవ్వాలని కోరుతున్నాను. ఆర్అడ్ బీ విద్యుత్ అధికారులకు పనుల కోసం అడిగితే నిధులు లేవని అంటున్నారు. ఉమ్మడి నల్గొండ మంత్రి జగదీష్ రెడ్డికి మళ్ళీ అడుగుతున్నా.. ప్రభుత్వ పథకాలకు కాకుండా మునుగోడు నియోజక వర్గంకి అభివృద్ధికి నిధులు తేవాలని అని అన్నారు.

Recommended Video

నిజాం ఆస్తుల గురించి అధికార పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారన్న బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు
ఎమ్మెల్యే రాజీనామా చేస్తా,, ఇకపై పోటీ కూడా చేయను: రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్యే రాజీనామా చేస్తా,, ఇకపై పోటీ కూడా చేయను: రాజగోపాల్ రెడ్డి

విలువలు కోల్పోయి మా కాంగ్రెస్ పార్టీపై గెలిచిన నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. దళిత బందు పథకం అనేది కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఈటెల రాజేందర్‌ను ఓడగొట్టడానికి అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి ఏమైందని ప్రశ్నించారు. దళిత బంధు పథకం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని మండిపడ్డారు. దళిత బందు పథకం మునుగోడు నియోజక వర్గం మొత్తం దళితులకు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయనని స్పష్టం చేశారు. ఇకనైనా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపైన వివక్ష తీసేసి అభివృధి చేయాలని లేకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. కాగా, గతంలో తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 2వేల కోట్లను కేసీఆర్ సర్కారు మంజూరు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
I will resign for mla post if kcr govt release of dalitha bandhu funds to my constituency: Komatireddy Rajagopal Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X