మాకు నష్టం చేసిన పవన్ కళ్యాణ్ ఇంటికెళ్తా, రానీయకుంటే ధర్నా: వీహెచ్
హైదరాబాద్: అవినీతిని రూపుమాపుతానంటూ అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయాడని, సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు మద్దతు పలికి తమకు నష్టం చేసిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించడం లేదని వీ హనుమంత రావు సోమవారం అన్నారు.
ఓటుకు నోటు పైన మాట్లాడనందుకు తాను పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి నిలదీస్తానని చెప్పారు. తాను ఆయన ఇంటికి వెళ్తానని, ఆయన ఇంట్లోకి రానిస్తే అక్కడ చర్చిస్తానని లేదంటే ఇంటిముందు ఆందోళన చేస్తానని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటల పైన ఆయన స్పందించవలసి ఉందని చెప్పారు.

సెక్షన్ 8పై తెలంగాణ టీడీపీ నేతలకు హరీష్ రావు
పూట పూటకు మీడియా సమావేశాలు నిర్వహించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు సోమవారం ప్రశ్నించారు.
మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని గోకుల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టపగలు నగ్నంగా దొరికిపోయినా చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని దబాయించే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు.
తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది వాస్తవం కాదా? ఈ విషయంపై బాబు మాట్లాడకుండా ఎందుకు దాటవేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏసీబీకి పట్టుబడినా బాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలుపదల చేయాలని కేంద్రానికి బాబు లేఖ రాస్తే ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావులు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నిజస్వరూపం బయటపడడంతో శాంతి భద్రతలు సజావుగా లేవంటూ హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేస్తూ గవర్నర్ పాలన తీసుకురావాలని కోరుతున్నారన్నారు. దీనిపై మాట్లాడరెందుకన్నారు.












Click it and Unblock the Notifications