బెడ్‌రూమ్‌కే అమ్మాయిలను తీసుకొచ్చేవాడు, నాపై తప్పుడు ప్రచారం: వనితారెడ్డి సంచలనం
హైదరాబాద్: తనపై తప్పుడు కథనాలు రాశారని ఆత్మహత్య చేసుకొన్న సినీ నటుడు విజయ్ భార్య వనితారెడ్డి ఆరోపించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు.పోలీసులకు లొంగిపోనున్నట్టు ఆమె ప్రకటించారు.
Recommended Video

తెలుగు సినీ నటుడు విజయ్ ఆత్మహత్య చేసుకొన్న తర్వాత రెండు రోజులకు వనితా రెడ్డి అదృశ్యమయ్యారు. ఆమెను విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తే ఆమె అందుబాటులోకి రాలేదు. అయితే అదే సమయంలో ఆమె ఇంటికి వెళ్తే అక్కడ లేరని పోలీసులు గుర్తించారు.
పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న వనితారెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో వనితారెడ్డి పలు విషయాలను ప్రస్తావించారు.

ఎక్కడికీ పారిపోలేదు
తాను ఎక్కడికీ పారిపోలేదని సినీ నటుడు విజయ్ సాయి భార్య వనితారెడ్డి చెప్పారు.విజయ్ సాయి ఆత్మహత్య తర్వాత మీడియా తనపై తప్పుడు కథనాలు రాసిందని ఆమె ఆరోపణలు గుప్పించారు. విజయ్ సాయి ఆత్మహత్య విషయంలో ఏం జరిగిందో తెలియకుండానే మీడియాలో వార్తలు వచ్చాయని ఆమె అభిప్రాయపడ్డారు. బుదవారం నాడు లొంగిపోనున్నట్టు వనితారెడ్డి చెప్పారు. తన కూతురి కోసమే తాను తాపత్రయపడుతున్నట్టు వనితారెడ్డి చెప్పారు.

బెడ్‌రూమ్‌కే అమ్మాయిలను తీసుకొచ్చేవాడు
విజయ్ ఎంతో మంది అమ్మాయిలను బెడ్ రూమ్ కి తీసుకు వచ్చేవాడని వనితారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు కోసం వేధించేవాడని అన్నారు. తనను ఎన్నోసార్లు కొట్టాడని ఆ ఇంటర్వ్యూలో వనితారెడ్డి ఆరోపించారు.

చెడు ప్రచారం చేసిన విజయ్
విజయ్ తనపై చెడు ప్రచారం చేశాడని వాపోయారు. తాను ఎక్కడకు వెళ్లినా, వెంటపడి వేధించేవాడని చెప్పారు. ఈ క్రమంలోనే విడాకుల కోసం కేసు వేశానని తెలిపారు.తనపై చేసిన తప్పుడు ప్రచారంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్టు చెప్పారు వనితారెడ్డి.

తన బిడ్డ గురించి విజయ్ తల్లిదండ్రులు ఏం చెబుతారు
తన బిడ్డ గురించి విజయ్ తల్లిదండ్రులు ఒక్క క్షణం కూడ ఆలోచించడం లేదని వనితారెడ్డి ఆరోపించారు. విజయ్ కారు, ఆస్తి, నగలను తీసుకెళ్ళానని ఆరోపణలు గుప్పించారని ఆమె గుర్తు చేశారు. తమ మనుమరాలు ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఏమిటనే విషయమై ఎందుకు మాట్లాడడం లేదని వనితారెడ్డి ప్రశ్నించారు.విజయ్ తల్లిదండ్రుల వల్లే తమ మధ్య విబేధాలు తలెత్తాయని వనితారెడ్డి ఆరోపించారు.

ఆ కారు తనదేనన్న వనితారెడ్డి
విజయ్ సాయి ఇంటి నుండి తీసుకెళ్ళిన కారు తనదేనని వనితారెడ్డి చెప్పారు.అసలు కారు గురించి తెలుసుకోకుండానే కారు కూతలు కూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.కారు కోసం గొడవ జరగలేదని, ఆ కారు తనదే అని చెప్పారు.కారు కోసం జూబ్లీహిల్స్ పీఎస్ లో కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. కారు కోసం హ్యుందాయ్ షోరూమ్ వాళ్లని తీసుకెళ్లానని తెలిపారు.

విజయ్ ఆత్మహత్య చేసుకోవడం సరైంది కాదు
విజయ్ ఆత్మహత్య చేసుకొంటాడని తాను ఊహించలేదని వనితారెడ్డి ప్రకటించారు. విజయ్ ఆత్మహత్య చేసుకొంటాడని భావించలేదని వనితారెడ్డి అభిప్రాయపడ్డారు.విజయ్ ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసి తన కూతురు తట్టుకోలేకపోయిందన్నారు. తండ్రి లేని బిడ్డగా తన కూతురు మారిందన్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications