'బలవంతుడి టైం అయిపోయే దాక బలహీనుడు సైలెంట్‌గానే': జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తలో నిలిచే నేత. తాజాగా, అలాంటి ఆసక్తకర వ్యాఖ్యలే చేశారు. 'బలవంతుడు - బలహీనుడు కథ' అంటూ ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారాయన. రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని పంపించారు. ధిష్ఠానం ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పూర్తి సమయాన్ని కేటాయిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
'ఒక బలవంతుడు భూమి మీద ఎప్పటికీ బలవంతుడిగా ఉండలేడు. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడు. అతడు ఏదో ఒక రోజు బలహీనుడు కాక తప్పదు. అది ఏ వ్యవస్థలోనైనా, వ్యాపారం, రాజకీయం ఏ రంగంలోనైనా అంతే. అలాగే బలహీనులు ఎప్పటికీ బలహీనులుగా ఉండరు' అంటూ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు ఈ ప్రకటన ద్వారా ఆయన ఒక సందేశం ఇవ్వడం గమనార్హం.

'బలవంతుడి సమయం గడిచే వరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడు. ఆ మౌనం బలహీనుడి బలహీనత కాదు. బలహీనుడు తన టైం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కాలం చేసే నిర్ణయంలో బలహీనుడు ఒక రోజు బలవంతుడు అవుతాడు. మనిషి జీవితం యవ్వనం నుంచి ముసలితనం వరకు ఎలాగైతే సాగుతుందో అలాగే ఈ బలవంతుడు బలహీనుడి కథ కూడా అంతే. ఒక నాయకుడి గెలుపు, ప్రజలను పరిపాలించే సమయం. ఒక నాయకుడి ఓటమి, గత పరిపాలనలో ఉన్న లోపాలు. ఆ లోపాలను సమీక్షించుకొని భవిష్యత్తులో విజయాలు సాధించడానికి ముందడగు వేసే సమయం' అంటూ జగ్గారెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.
అంతేగాక, తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో 3 సార్లు సంగారెడ్డి ప్రజలు తనను గెలిపించుకున్నారని జగ్గారెడ్డిగా తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మంచి పరిపాలన చేశానని వివరించారు. మొదటిసారి 2014లో ఓడిపోయినా.. ఆ ఓటమి తనకు చాలా అనుభవాలు నేర్పిందన్నారు. అలాగే ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఓడిపోయానని తెలిపారు. అయితే, ఈ పది రోజుల్లోనే చాలా అనుభవాలు నేర్చుకున్నానని చెప్పారు.
ఈసారి తమ సంగారెడ్డి ప్రజలు తనకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారని జగ్గారెడ్డి చెప్పారు. అందుకే ఈ సమయాన్ని తాను పూర్తిగా పార్టీ కోసం పని చేసేందుకు ఉపయోగించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 6 గ్యారెంటీలను తెలంగాణలో అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే తాను ఎమ్మెల్యేగా లేకపోయినా సంగారెడ్డి ప్రజలకు కూడా ఆ పథకాలను అందేలా కృషి చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఆలోచనను కాంగ్రెస్ నాయకత్వానికి, ప్రభుత్వంలోని ఉన్న నాయకత్వానికి, నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానుకు, రాష్ట్ర ప్రజలకు తెలియ జేస్తున్నట్లు వెల్లడించారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications