రంగంలోకి కుంతియా: రేవంత్‌ చేరికకు అభ్యంతరం లేదు: డికెఅరుణ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా మార్గం సుగమం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆదివారం నాడు కుంతియా హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. రేవంత్‌రెడ్డి పార్టీలో చేరే విషయమై పార్టీ నేతలతో చర్చించారు.

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు.కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

అయితే తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి పార్టీలో చేరడాన్ని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు.

కాంగ్రెస్ నేతలతో కుంతియా చర్చలు

కాంగ్రెస్ నేతలతో కుంతియా చర్చలు

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కుంతియా కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్‌రెడ్డి చేరిక విషయమై నచ్చచెప్పారని సమాచారం. రేవంత్‌ చేరిక వల్ల పార్టీకి ఏ రకంగా ప్రయోజనం జరుగుతోందనే విషయమై కుంతియా పార్టీ నేతలతో చర్చించారు.

రేవంత్‌రెడ్డి చేరికకు వ్యతిరేకం కాదు

రేవంత్‌రెడ్డి చేరికకు వ్యతిరేకం కాదు

కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి డికె అరుణ ప్రకటించారు. వారం రోజుల క్రితం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డికె అరుణ ఇంటికి వెళ్ళి చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్న విషయమై ఆమెతో చెప్పారు. ఈ తరుణంలో డికె అరుణతో పాటు మరికొందరు నేతలు రేవంత్ రాకను వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి.ఈ తరుణంలో కుంతియా రంగంలోకి దిగారు. దీంతో రేవంత్‌ రాకకు తాము వ్యతిరేకం కాదని డికె అరుణ ప్రకటించారు.

కోమటిరెడ్డి సోదరులు ఇలా..

కోమటిరెడ్డి సోదరులు ఇలా..

కోమటిరెడ్డి సోదరులు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కొంత అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే కోమటిరెడ్డి సోదరులతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యేందుకు కూడ ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యం కాలేదు. ఈ తరుణంలో కుంతియాతో కాంగ్రెస్ పార్టీ నేతలకు సర్ధిచెప్పారని అంటున్నారు. అయితే పీసీసీ పీఠం కన్నేసిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పటికే కొంత అసంతృప్తి గళాన్ని వినిపిస్తూ వచ్చారు. అయితే రేవంత్‌లాంటి నేతలు పార్టీలో చాలా మంది ఉన్నారని కూడ ఇటీవలే కోమటిరెడ్డి సోదరులు ప్రకటించడం గమనార్హం.

రాహూల్ పర్యటన

రాహూల్ పర్యటన

కాంగ్రెస్‌లోకి రేవంత్‌ రాకను ఎవరూ వ్యతిరేకించడం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా తెలిపారు. డీకే అరుణతో ఇప్పటికే మాట్లాడానని, పెద్ద వ్యతిరేకత లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో షరతులతో కూడిన చేరికలు ఉండవని కుంతియ చెప్పుకొచ్చారు. నవంబర్‌లో రాహుల్‌ పర్యటన ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దుకు నిరసనగా నవంబర్‌ 8న బ్లాక్‌ డేకు పిలుపునిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress party senior leader DK Aruna said that Iam not against Revanth Reddy to join in Congress. She spoke to media on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి