IBOMMA : "మాతో పెట్టుకోవద్దు".. పోలీసులకు ఐ బొమ్మ వార్నింగ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పైరసీ భూతం సినిమాలకు పెద్ద ప్రాబ్లమ్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పైరసీపై హైదరాబాద్ పోలీసుల మెరుపుదాడి నిర్వహించారు. దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ కేసును ఛేదించిన సీవీ ఆనంద్ పైరసీ ముఠాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐ బొమ్మ వెబ్ సైట్ పై ఫోకస్ చేశామని.. దాని వెనకున్న కేటుగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే తాజాగా ఈ ఘటనపై ఐ బొమ్మ వెబ్ సైట్ ధీటుగా సమాధానం ఇచ్చింది. తమ వెబ్ సైట్‌లో ఒక ముఖ్యమైన నోటీసును రిలీజ్ చేసింది.
ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అని ఆ మెసేజ్ లో ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారని పేర్కొంది. అంతేకాక మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. మా వెబ్ సైట్ ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతాం అని వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుందని పేర్కొంది. రూ. 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమని హెచ్చరికలు జారీ చేసింది.
అంతేకాక.. 'మా టెలిగ్రామ్ గ్రూపులు, సబ్ స్క్రిప్షన్లు బహిర్గతం చేస్తామని.. రూ. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. మీడియా, ఓటీటీ, హీరోలకూ షాకింగ్ వార్త రివీల్ అవుతుంది. ప్రతి యూజర్ ఫోన్ నంబర్ మా డేటాబేస్ లో నిక్షిప్తమై ఉంది. దేశం మొత్తంలో మా సపోర్ట్ ఉంది. మా వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే - మీరే ఎక్స్ పోజ్ కు గురవుతారు. ఫ్యాన్స్ కు సీక్రెట్ గా ఉన్న హీరోల పేర్లు బయట పెడతామని పేర్కొంది.

కొన్ని ప్రొడక్షన్ హౌజ్ లు, యూట్యూబ్ ఛానళ్లు ఉద్దేశపూర్వకంగా ఐ బొమ్మను తప్పుగా ప్రచారం చేస్తున్నాయని, తాము ఎలాంటి హ్యాకింగ్, ఫోన్ ట్రాకింగ్ చేయబోమని మరోసారి హామీ ఇచ్చింది. అలాగే తమది ఒక భారతీయ సైట్ అని, తెలుగు ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉన్నామని ఐ బొమ్మ స్పష్టం చేసింది. హీరోలకు వందల కోట్లు రెమ్మునరేషన్ ఇచ్చి.. భారీ బడ్జెట్ లు చూపించి సామాన్య ప్రేక్షకులపై ఆ ప్రభావం చూపుతున్నారని ఐ బొమ్మ మండిపడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ గా మారింది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications