హైదరాబాద్‌ను అంబానీకి అమ్మేస్తారు -బీజేపీపైనే చార్జిషీట్ వేయాలి -జవదేకర్‌కు శ్రీనివాస్ గౌడ్ కౌంటర్
'6ఏళ్లలో 60 వైఫల్యాలు' పేరుతో టీఆర్ఎస్ పై చార్జిషీటు విడుదల చేసిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధిలో దూసుకెళుతోన్న తెలంగాణకు బీజేపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నదని, దేశానికి వెన్నెముక లాంటి 26 ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మిన నేరానికి బీజేపీపైనే చార్జిషీటు వేయాల్సి ఉందని గౌడ్ మండిపడ్డారు.
Recommended Video

జవదేకర్‌కు కౌంటర్
టీఆర్ఎస్ పై చార్జిషీటు పేరుతో బుక్ లెడ్ విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్.. సీఎం కేసీఆర్ ను ఉద్దించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని, ఫ్యామిలీ ఆస్తులను పెంచుకుంటున్నారని ఆరోపించారు. వీటికి శ్రీనివాస్ గౌడ్ కౌంటరిస్తూ.. నిజంగా చేసిన తప్పులకు చార్జిషీట్ వేయాల్సి వస్తే బీజేపీనే తొలి దోషిగా ఉంటుందని, దేశంలో 26 ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మిన బీజేపీ.. పొరపాటున గెలిస్తే హైదరాబాద్ ను అంబానీకి అమ్మేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

మోదీ పొడిడిన సంగతి మర్చారా?
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పరిపాలనా విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర్నుంచి నిన్నటికి నిన్న కేంద్ర జలవనరులశాఖ మంత్రి దాకా పొగడ్తలు కురిపించిన విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గుర్తుచేశారు. అయితే ఎన్నికలు రాగానే ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా తిరిగి అదే బీజేపీ నేతలు మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, హైదరాబాద్ కు ఎంఐఎం మేయర్ కావాలా? అంటూ జవదేకర్ అడుగుతున్నారని, అసలు బీజేపీ విధానామే ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాల్చుకోవడమని మంత్రి మండిపడ్డారు.

బీజేపీపైనే చార్జిషీట్ వేయాలి..
‘‘మరోవైపు తెలంగాణకు సహకరించామంటూనే అక్రమంగా 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారు. ఆరేళ్లలో తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. కేంద్రం సహకారం లేకున్నా సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఇది ఓర్వలేకపోతున్న బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. చార్జిషీటు వేయాల్సి వస్తే బీజేపీపైనే వేయాలి. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, రైల్వే తదితర 26 సంస్థలను ప్రైవేటుపరం చేసినందుకు బీజేపీపైనే చార్జిషీటు వేయాలి'' అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications