తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తా, నా బిడ్డ భవిష్యత్ ఆలోచించండి: వనితా రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: తప్పు చేస్తే.. ఆ తప్పుకు శిక్షను అనుభవిస్తానని సినీ నటుడు విజయ్ సాయి సతీమణి వనితారెడ్డి ప్రకటించారు. మంగళవారం రాత్రి సెల్పీ వీడియోను విడుదల చేశారు. విజయ్ సాయి మరణంపై వస్తున్న ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు.
Recommended Video

తెలుగు సినీ నటుడు విజయ్ సాయి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఈ ఘటనపై వనితారెడ్డిపై విజయ్ సాయి కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే వనితారెడ్డి కూడ విజయ్ సాయి కుటుంబంపై ప్రత్యారోపణలు చేస్తోంది.
విజయ్ సాయి ఆత్మహత్య చేసుకొనే ముందు సెల్పీ వీడియో రికార్డు చేశారు. ఈ సెల్పీ వీడియో ఆధారంగా విచారణ జరిపించాలంటూ విజయ్ సాయి తండ్రి సుబ్బారావు కోరుతున్నారు.

తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తా
తెలుగు సినీ నటుడు విజయ్ సాయి సతీమణి వనితారెడ్డి మంగళవారం రాత్రి ఓ సెల్పీ వీడియోను విడుదల చేసింది. మీడియాలో ప్రసారమౌతున్న కథనాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను తప్పు చేస్తే శిక్షను అనుభవిస్తానని ఆమె అభిప్రాయపడింది. అయితే వాస్తవాలు తనతో పాటు విజయ్ సాయి స్నేహితులకు తెలుసునని ఆమె చెప్పారు.

నా బిడ్డ భవిష్యత్ గురించి ఆలోచించాలి
తనపై ఆరోపణలు చేసే వారంతా తన బిడ్డ భవిష్యత్ గురించి ఆలోచించాలని ఆమె హితవు పలికారు. కోర్టులో వాస్తవాలు తేలుతాయని తొందరపడి నిందలు వేయకూడదని వనితారెడ్డి కోరారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

విజయ్ పిరికివాడనుకోలేదు
విజయ్ పిరికివాడనుకోలేదని వనితారెడ్డి అభిప్రాయపడ్డారు. విజయ్ ఆత్మహత్య చేసుకొంటాడని తాను అనుకోలేదని ఆమె ఆ వీడియోలో అభిప్రాయపడ్డారు. విజయ్ పిరికివాడని ఆత్మహత్యతో తేలిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు.

బలిపశువు చేసే ప్రయత్నం
తనను బలిపశువును చేయడానికి విజయ్ తండ్రి సుబ్బారావు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తన కూతురుతో కలిసి ఏడుస్తూ తన ఆవేదనను వనితా రెడ్డి ఆ వీడియోలో పోస్ట్ చేశారు. విజయ్ కుటుంబం ఏ రకంగా తనపై ఆరోపణలు చేస్తోందో ఆమె ఆరోపణలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications