బావపై మోజుతో భర్తను చంపేసింది: ప్రియుడిని పిలిపించుకొని, కొడుకు ఉండగా

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ: గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామ పంచాయతీ ఏపూరు తండాలో అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే భార్య భర్తను చంపేసింది.

ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను దారణంగా హత్య చేసింది. పోలీసులు విచారణ జరిపి అన్ని విషయాలను రాబట్టారు. అనంతరం సోమవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించి వివరాలను తెలిపారు.

మరో సంఘటన: భర్తను చంపిన భార్య, ఎందుకంటే?

భార్యను విచారించడంతో

భార్యను విచారించడంతో

ఏపూరు తండాలో డిసెంబర్ 28న అర్ధరాత్రి సోమ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భార్యనే హత్యకు పాల్పడిందనే అనుమానంతో సోమా బంధువులు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సోమ భార్య భారతిని అదుపులోకి తీసుకొని విచారించారు.

బావతో వివాహేతర సంబంధం

బావతో వివాహేతర సంబంధం

దీంతో అసలు విషయం వెలుగు చూసింది. మృతుడు సోమా, కుమారుడు మహేష్‌తో కలిసి తండాలో జీవనం సాగిస్తున్న భారతి గత కొంత కాలంగా అదే తండాకు చెందిన వరుసకు బావ అయ్యే రమావత్‌ శివ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన సోమా పలుమార్లు భార్యను మందలించాడు.

ప్రియుడిని పిలిపించుకుంది

ప్రియుడిని పిలిపించుకుంది

అయినా భారతి ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భారతి, అతన్ని హత్య చేయాలనుకుంది. ఈ క్రమంలో డిసెంబర్‌ 28 రాత్రి మద్యం మత్తులో ఉన్న సోమ భార్య, కుమారుడితో గొడవ పడి నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన భారతి ప్రియుడు శివకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకుంది.

నిద్రపోతుండగా చంపేశారు

నిద్రపోతుండగా చంపేశారు

సోమా, కుమారుడు మహేష్‌ నిద్రపోతుండగా భారతి, ప్రియుడు శివ ఇద్దరూ కలిసి హత్య చేశారు. మంచంపై నిద్రపోయిన సోమాను శివ గట్టిగా గొంతు నులమగా, భారతి భర్త సోమా ముఖంపై బొంతను వేసి ఊపిరి ఆడకుండా చేయడంతో అతను మృతి చెందారు. పోలీసుల విచారణలో నిందితులు ఈ మేరకు నేరాన్ని అంగీకరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Husband Killed wife in Nalgonda District on December 29th over Illegal affair.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి