కుండపోత వర్షాలు, రెడ్ అలర్ట్ - బయటకు రావద్దు..ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు వర్షపాతం నమోదు అవుతోంది. పలు ప్రాంతాల కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆ మూడు రోజులు అత్యవసరం అయితే మినహా బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించారు.
ఉపరితల ఆవర్తనం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ మూడు రోజులు అవసరమైతేతప్ప బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కాలేజీలకు బుధవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

గురువారం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్జ్ జారీ చేసింది. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీచేసింది.
మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. గురువారం పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్ర భుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేర కు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications