హైదరాబాద్‌లో మోస్తరు వర్షం : పలుచోట్ల కరెంట్ కట్
హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. భానుడి భగభగలతో అల్లాడిన జనానికి చల్లని గాలితో కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడగా .. రాత్రి 7 గంటల నుంచి నగరంలోని పాలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

భాగ్యనగరంలో మోస్తరు వర్షం
అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, ఎస్‌ఆర్‌నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, మాదాపూర్, సనత్ నగర్, గచ్చిబౌలి, చిలకలగూడ, తార్నాక, మెహిదీపట్నం, కోఠి, హబ్సిగూడ, నాచారం, ఓయూ, తార్నాక తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని చోట్ల భారీ ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వరంగల్‌లో కూడా ....
ఇటు వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం పడేముందు ఘట్ కేసర్ లోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో గల చెట్టుపై పిడుగువేయడంతో అది కాలిపోయింది. ఓ వైపు తాటిచెట్టుకు మంటలు అంటుకోగా .. మరోవైపు వర్షం కురిసింది. చూడడానికి వింతగా అనిపించింది ఈ ఘటన.












Click it and Unblock the Notifications