కేసీఆర్ పాలనలో ధనికరాష్ట్రంలో ధనం, బంగారు తెలంగాణాలో బంగారం మాయమైంది

తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కెసిఆర్ పాలన ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల. కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు అయిందని, బంగారు తెలంగాణలో బంగారం మాయమైందని టార్గెట్ చేసిన షర్మిల రాష్ట్రంలో కరెంట్ బిల్లుల విషయంలో ప్రజల నడ్డి విరుస్తున్న వైనాన్ని ప్రశ్నించారు. జనాలకు గాల్లో మేడలు కట్టి, ఫాంహౌస్లో కోటలు కట్టుకున్న కెసిఆర్ ఫామ్హౌస్ పాలనకు తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించాలా అంటూ గట్టిగా నిలదీశారు.

 జనం నడ్డి విరిచి బిల్లులు రాబడతారా: షర్మిల ప్రశ్న

జనం నడ్డి విరిచి బిల్లులు రాబడతారా: షర్మిల ప్రశ్న

రాష్ట్రంలో విద్యుత్ బకాయిల విషయంలో, ప్రజలపై పడుతున్న మోయలేని భారం విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలకు ప్రజలను బలి చేస్తారా అంటూ ప్రశ్నించారు. విద్యుత్ లైన్ల లోపాలకు.. కరెంట్ కొనుగోళ్ల అవకతవకలకు కారకులెవరు అని ప్రశ్నించిన షర్మిల డిస్కం తప్పిదాలకు .. సర్కార్ చెల్లించాల్సిన బకాయిలకు, జనాన్ని బలి చేస్తారా అంటూ నిలదీశారు. జనం నడ్డి విరిచి బిల్లులు రాబడతారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

 కాళేశ్వరం కరెంట్ బిల్లుల భారం జనం నెత్తిన రుద్దుతారా?

కాళేశ్వరం కరెంట్ బిల్లుల భారం జనం నెత్తిన రుద్దుతారా?

కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలను దుబారా చూసి అవినీతికి పాల్పడ్డారని ఇప్పటికే ఆరోపించిన వైయస్ షర్మిల, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో పోశారు అంటూ మండిపడ్డారు. ఇక ఆ కరెంటు బిల్లుల భారం జనం నెత్తిమీద రుద్దుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు జనం మీద కరెంటు బిల్లుల భారం మోపడాన్ని తప్పుపట్టిన వైయస్ షర్మిల తనదైన రీతిలో మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో ఎత్తిపోతల నీళ్ళు సముద్రం లో పోసి, దాని కోసం వినియోగించిన కరెంట్ బిల్లులను 9 వేల కోట్ల రూపాయలను జన నెత్తి మీద రుద్దటం ఏ విధమైన న్యాయం అంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణాలో ప్రభుత్వ శాఖల కరెంట్ బిల్లుల బకాయిలు ఇంతగానా?

తెలంగాణాలో ప్రభుత్వ శాఖల కరెంట్ బిల్లుల బకాయిలు ఇంతగానా?

అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టవలసిన ప్రభుత్వ శాఖల బకాయిలు 2014 సంవత్సరం లో 1302 కోట్లు ఉంటాయి 2022 నాటికి 20,841 కోట్ల రూపాయలకు ఎందుకు పెరిగిందో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. తప్పుడు విధానాలతో దోచుకోవడమే తప్పించి ప్రజలకు మేలు చేసే సోయిలేని కేసీఆర్ స్వార్థ పాలనకు ఇది నిదర్శనమన్నారు. కెసిఆర్ స్వార్ధ పాలనకు తెలంగాణ ప్రజల మీద పడుతున్న భారం 17 వేల కోట్ల రూపాయల వరకూ అంటున్నారని పేర్కొన్న షర్మిల, నీకు ఓటు వేసిన పాపానికి ప్రజల నెత్తిన ఇంత భారం మోపుతారా అంటూ నిలదీశారు.

మీ ధనదాహం ప్రజలకు శాపమైంది: భగ్గుమన్న షర్మిల

మీ ధనదాహం ప్రజలకు శాపమైంది: భగ్గుమన్న షర్మిల


కాసుల కక్కుర్తి కోసం ఎత్తిపోతల పేరుతో ఎత్తేసిన సొమ్ము ఒకపక్కన, వాటి నిర్వహణ భారం తలకుమించిన ఇంకో పక్కన అంటూ మండిపడిన షర్మిల 2014లో ఇరిగేషన్ శాఖ విద్యుత్ బకాయిలు 107 కోట్ల రూపాయలు ఉంటే, 2020నాటికి 9268 కోట్ల రూపాయలకు పెరిగిందని పేర్కొన్నారు. మీ మోసం బద్దలైంది. మీ ధనదాహం తెలంగాణ ప్రజలకు శాపమైంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. మీకు సిగ్గు ఎందుకు వేయడం లేదంటూ వైయస్ షర్మిల కెసిఆర్ ను నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+