తెలంగాణలో అదే ఉధృతి: 84 వేలకు పైగా: కరోనా బారిన పడుతోన్న ప్రజలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. అదే ఉధృతి కొనసాగుతోంది. మరోసారి రెండు వేలకు చేరువగా కరోనా పాజిటివ్ రోజువారీ కేసులు రికార్డు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సహా దానికి ఆనుకుని ఉండే జిల్లాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే జీహెచ్ఎంసీ సమీప జిల్లాల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది.

84 వేలను దాటిన కరోనా కేసులు..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1897 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు. 1920 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84,544కు చేరుకుంది. ఇందులో 61,294 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 654కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 22,596గా నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే బులెటిన్‌ను విడుదల చేసింది.

జీహెచ్ఎంసీలో తగ్గని వైరస్ తీవ్రత..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. ఎప్పట్లాగే పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో 479 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. ఈ మధ్యకాలంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్యలో పెరుగుదల కనిపించింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి-172, రంగారెడ్డి-162, సంగారెడ్డి-107 కేసులు తాజాగా నమోదు అయ్యాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసులివే..
జిల్లాలవారీగా చూస్తే 24 గంటల్లో ఆదిలాబాద్-21, భద్రాద్రి కొత్తగూడెం-44, జగిత్యాల-28, జనగామ-26, జయశంకర్ భూపాలపల్లి-16, జోగుళాంబ గద్వాల-38, కామారెడ్డి-48, కరీంనగర్-64, ఖమ్మం-63, కొమరంభీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్ నగర్-41, మహబూబాబాద్-14, మంచిర్యాల-38, మెదక్-26, మేడ్చల్ మల్కాజ్‌గిరి-179, ములుగు-10, నాగర్ కర్నూలు-16, నల్లగొండ-54, నారాయణపేట్-12, నిర్మల్-21, నిజామాబాద్-23,పెద్దపల్లి-62, రాజన్న సిరిసిల్ల- 43, రంగారెడ్డి-162, సంగారెడ్డి-107, సిద్ధిపేట్-62, సూర్యాపేట్-36, వికారాబాాద్-18, వనపర్తి-26, వరంగల్ రూరల్-87, వరంగల్ అర్బన్-87, యాదగిరి భువనగిరి-11 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video

తగ్గిన కరోనా శాంపిల్స్ టెస్టులు..
24 గంటల వ్యవధిలో మొత్తం 22,972 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 6,65,847కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో ముమ్మరంగా శాంపిళ్ల టెస్టులను కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 17,934.5 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications