మార్ఫింగ్ ఫోటో కాదు కదా?: దేవేగౌడ యోగాపై మంత్రి కేటీఆర్, ఎంతోమంది ఫిదా
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని దేవేగౌడ వేసిన యోగాసనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, తెలంగాణ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావులు కూడా స్పందించారు.
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిట్‌నెస్ సవాల్ విసిరారు. ఆ ట్వీట్‌కు కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించి పలు యోగాసనాలు వేసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు యోగా దినోత్సవం సందర్భంగా దేవెగౌడ మరోసారి యోగా చేసి అలరించారు. ఆయన యోగాకు చాలామంది ఫిదా అయ్యారు.

పరుపుపై పడుకొని ఆయన ఆసనం వేశారు. దీనిపై ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయగా, దాన్ని రీట్వీట్ చేస్తూ స్పందించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీరు చెప్పేది నిజమేనా.. ఇది మార్ఫ్ చేసిన ఫొటో కాదు కదా? అంటూ కామెంట్ చేశారు. కాగా, దేవెగౌడకు యోగా చేయడం అలవాటే.
Recommended Video

Are you sure this ain’t a photoshopped pic 😀? https://t.co/MJeXuY72f8
— KTR (@KTRTRS) June 21, 2018












Click it and Unblock the Notifications