తెలంగాణకు భారీ వర్షాలు.. ఆ రోజు పరిస్థితి ఏమిటి?
తెలంగాణ వ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి విభిన్నమైన వాతావరణం నెలకొని ఉంది. వారం రోజుల క్రితం వరకు ఎండలవల్ల ప్రజలు మాడిపోయారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో కాస్తంత ఉపశమనం పొందుతున్నారు. తమిళనాడు మీదగా విస్తరించిన ఉపరితల ఆవర్తనంవల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. తెలంగాణలో రాబోయే నాలుగురోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో ఈనెల 15 వరకు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులుంటాయని, చెట్లదగ్గర ఎవరూ ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెంటీమీటర్ల వర్షం శుక్రవారం కురిసింది. సత్తుపల్లిలో 5.1 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా శంకరంపేటలో 4.7 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 3.8 సెంటీమీటర్ల చొప్పున వర్షాలు కురిశాయి.













Click it and Unblock the Notifications