గాల్లో 45ని.లు విమానం చక్కెర్లు, హైద్రాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్: భాగ్యనగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా దిగింది. అంతకుముందు అది గాలిలోనే 45 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కలకత్తా నుంచి బెంగళూరు వెళ్తోంది.
ఈ క్రమంలో ఓ ప్రయాణీకుడికి గుండెపోటు వచ్చింది. పైలట్ అత్యవసరంగా ఏటీసీకీ సమాచారం ఇచ్చారు. దీంతో హైదరాబాదులో ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. అయితే రన్ వే మాత్రం ఖాళీగా లేదు. దీంతో ఆ విమానం 45 నిమిషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది.

అనంతరం రన్ వే పైన దిగింది. అప్పటికే విమానాశ్రయ సిబ్బంది వైద్యులను రప్పించారు. విమానం ల్యాండ్ కాగానే ఆయనకు చికిత్స ప్రారంభించారు.
విదేశీ కరెన్సీ స్వాధీనం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రూ.55 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం విమానాశ్రయంలో తనిఖీలు చేసిన అధికారులు దుబాయ్ వెళ్తున్న హైదరాబాద్ వాసి హైమద్ నుంచి ఈ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. హైమద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications