తెలంగాణలోని మహిళలకు గేదెల పంపిణీ.. ఆ రోజు నుంచే ప్రారంభం
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని రేవంత్ సర్కార్ సంకల్పించింది. అలాగే అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది. ఆ తర్వాత రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేపట్టింది. ఇక తాజాగా దసరా పండుగను పురస్కరించుకుని మహిళలకు రేవంతన్న కానుకగా చేనేత చీరలను ఇందిరా మహిళ శక్తి పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పండును పురస్కరించుకొని రెండేసి చీరెలను పంపిణీ చేయాలని నిర్ణ యించింది. ప్రస్తుతం చీరల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే తాజాగా తెలంగాణలోని మహిళల కోసం మరో కొత్త పథకం ప్రారంభించింది.'ఇందిరా మహిళా డెయిరీ' పథకం ఈ ఇందిరా మహిళా డెయిరీ స్కీమ్ కింద ఎంపిక చేసిన మహిళలకు రెండు గేదెల చొప్పున పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాను ఎంచుకుంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో తాజాగా ఈ పథకం ప్రారంభం అయింది. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళా లబ్ధిదారులకు 80 శాతం సబ్సిడీతో రెండు గేదెలను పంపిణీ చేస్తారు. మొదటి విడతలో 125 యూనిట్ల గేదెలు అందజేశారు. ఖమ్మం జిల్లాలో ఈ పథకం విజయవంతం అయితే భవిష్యత్తులో రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ పథకం ప్రారంభం అయింది. తొలుత మధిర నియోజకవర్గంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గేదెల పంపిణీని మొదలుపెట్టారు. జిల్లా పర్చేస్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీ నుంచి కొనుగోలు చేసిన గేదెలను ముదిగొండ, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో లబ్ధిదారులకు అందజేశారు. దాంతో ఒక్కో లబ్ధిదారురాలికి రూ.4 లక్షలు విలువ చేసే రెండు గేదెలు రానున్నాయి. ఒక్కో గేదెకు సబ్సిడీ కింద రూ.1.60 లక్షలు మినహాయించి.. రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ మొత్తాన్ని చెల్లించలేని వారికి బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తున్నారు. అయితే పాలు అమ్మగా వచ్చిన లాభంతో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పాల సేకరణ కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

మధిర నియోజకవర్గంలో మొత్తం 62 వేల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉండగా.. వారిలో 20 వేల మంది ఈ పథకంలో రూ. 2,100 చెల్లించి సభ్యులుగా చేరారు. ఈ 20 వేల మంది మహిళలకు విడతల వారీగా 40 వేల గేదెలను అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. తొలి విడతలో 125 మంది లబ్ధిదారులకు 250 గేదెలను ఇప్పటికే పంపిణీ చేశారు.
మధిర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 62 వేల మంది ఉన్నారు. వీరిలో 20 వేల మంది ఈ పథకంలో రూ. 2,100 చెల్లించి సభ్యులుగా చేరారు. ఈ 20 వేల మందికి విడతల వారీగా 40 వేల గేదెలను సబ్సిడీపై మంజూరు చేసేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications