వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఈ గ్యారెంటీలలో ఒకటి ఇందిరమ్మ ఇళ్ల పథకం. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉండి అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలోకి జర్నలిస్టులు చేరారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జర్నలిస్టులకూ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా ప్రకటించారు. నాంపల్లి ప్రెస్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇస్తామని.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. మూతబడిన ప్రెస్ అకాడమీని ఈ నెల చివరి నాటికి తిరిగి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పేదలకే కాకుండా జర్నలిస్టులకూ ఇండ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లిలోని ప్రెస్ అకాడమీలో నిర్వహించిన సమావేశంలో జర్నలిస్టు కుటుంబాలకు పెన్షన్, ఎక్స్ గ్రేషియా చెక్కులు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో మరణించిన, అనారోగ్యాలతో బాధపడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఆయన స్వయంగా చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద జర్నలిస్టులు, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. జర్నలిస్టుల శిక్షణ కోసం మూతపడిన ప్రెస్ అకాడమీని అతి త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద.. ఇళ్లు లేదా భూమి లేని వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఉచిత భూమి/సైట్ అందిస్తారు. ఆర్థిక సహాయం రూ. 5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వారికి అందిస్తారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కూడా ఇస్తారు. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక ఉంటుంది. లబ్ధిదారుడు బీపీఎల్ కు దిగువన ఉన్న వారై ఉండాలి.












Click it and Unblock the Notifications