వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టుకు చేరిన ఇంటర్ బోర్డు వ్యవహారం .. బాలల హక్కుల కమీషన్ పిటీషన్ పై విచారణ

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక పక్క బాలల హక్కుల కమీషన్ కూడా ఈ వ్య్వహారమపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విద్యార్థులకు బోర్డు నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం తాలూకు ఆందోళనలు హైకోర్టుకు చేరాయి. ఇంటర్‌బోర్డులో అవకతవకల వ్యవహారంపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది.

ఒకే విద్యార్థికి రెండు మెమోలు .. ఒకటి పాస్ మరొకటి ఫెయిల్ .. డైలమాలో విద్యార్ధి భవిష్యత్ఒకే విద్యార్థికి రెండు మెమోలు .. ఒకటి పాస్ మరొకటి ఫెయిల్ .. డైలమాలో విద్యార్ధి భవిష్యత్

ఇంటర్ ఫలితాల అవకతవకల నేపధ్యంలో హైకోర్టులో దాఖలైన పిటీషన్ .. మధ్యాహ్నం విచారణ

ఇంటర్ ఫలితాల అవకతవకల నేపధ్యంలో హైకోర్టులో దాఖలైన పిటీషన్ .. మధ్యాహ్నం విచారణ

చనిపోయిన 16 మంది విద్యార్థులకుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై 304A కింద కేసులు నమోదు చేయాలని బాలల హక్కుల దాఖలు చేసిన పిటీషన్ ను ఇప్పుడు బెంచ్ విచారించనుంది. ఎలాంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్‌ చేయాలని పిటిషనర్‌ పేర్కోన్నారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని తమ పిటీషన్లో పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు

ఇంటర్మీడియట్ బోర్డు వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు

మరోవైపు ఇంటర్‌ బోర్డు ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు ముట్టడికి పలు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి . విద్యార్థుల మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే కొందరు విద్యార్థులు ఇంటర్‌ బోర్డులోపలకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఇప్పటికే భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మరోవైపు మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడికి ఎఐఎస్‌ఎఫ్ పిలుపు ఇచ్చింది.

మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఫీ లేకుండా రీ వాల్యువేషన్ చెయ్యాలని పిటీషన్ దాఖలు చేసిన బాలల హక్కుల కమీషన్

మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఫీ లేకుండా రీ వాల్యువేషన్ చెయ్యాలని పిటీషన్ దాఖలు చేసిన బాలల హక్కుల కమీషన్

ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని నిపుణుల కమిటీ ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడ ఇచ్చింది. ఈ తరుణంలో బాలల హక్కుల సంఘం మంగళవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది.ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ,విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం తన పిటీషన్ లో పేర్కొంది. మరి దీనిపై జరగనున్న విచారణ నేపధ్యంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి .

English summary
Student concerns continue in the intermediate exams in Telangana. A side child rights commission also filed a petition in the High Court on this . The concerns of the Board due to neglect of the students reached the High Court. The High Court has lodged a plea for the irregularities in the inter board. The bench will examine the petition filed by children against the deaths of 16 students and the cases filed against 304A of the accused. The petitioner has called for a revaluation without any fees. In their petition to pay compensation to the deceased students' families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X