వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ ఇంత రచ్చ చేసింది..! టెన్త్ ఎంత చెత్త చేస్తుందో..! త్వరలో ఎస్సెస్సీ ఫలితాలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల పరిణామాల నుండి పూర్తిగా తేరుకోక ముందు మరో ఫలితం రాబోతోంది. ఈ ఫలితాలు ప్రభుత్వాన్ని ఎంత అతలాకుతలం చేస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైన తరువాత నెలకొన్న గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపిన వేళ, త్వరలో విడుదల కానున్న టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అర్హత లేని ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను దిద్దిస్తున్నారని, త్వరగా మూల్యాంకనం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికీ రోజుకు 15 నుంచి 20 పేపర్లు అదనంగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇంటర్ ఫలితాల తరువాత నెలకొన్న పరిస్థితే, టెన్త్ తరువాత కూడా వస్తుందని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

99 మార్కులు రావాల్సిన వారికి సున్నా రావచ్చని, లేదా 120 మార్కులైనా రావచ్చని, పాస్ అయితే ఫెయిల్ అని, ఫెయిలయిన వారు పాస్ అయినట్టు వచ్చినా ఆశ్చర్య పోవద్దని జోకులు వస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని, రీ కౌంటింగ్ కు, రీ వాల్యుయేషన్ కు డబ్బు కట్టి ఆదుకోవాలన్న సెటైర్లూ పడుతున్నాయి.

inter results kept in tention.!what 10th do.? ssc reults soon..!!

ఇదిలావుండగా టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో ముగుస్తుందని తెలుస్తోంది. ఆ తరువాత ఫలితాలను క్రోఢీకరించి రిజల్ట్స్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఐతే ఇంటర్ పరీక్షా ఫలితాల్లో నెలకొన్న ఉాద్విగ్న పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లో పునరావ్రుత్తం చేయబోమని టెన్త్ బోర్డ్ అదికారులు స్పష్టం చేస్తున్నారు.

English summary
Another result is coming out after the inter results. These 10th class results are of utmost interest in how much the government will shake. everyone looking farward for the results with tension in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X