ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!!
ఇంటర్ ఫలితాల పై బిగ్ అప్డేట్. ఇంటర్ ఫలితాలను గతం కంటే వేగంగా.. ఈ సారి ముందుగానే వెల్లడించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నిర్దేశించిన గడువు మేరకు పరీక్షా పత్రాల వాల్యుయేషన్ పూర్తి చేసారు. ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఏపీ, తెలంగాణ లో ఇంటర్ ఫలితాల విడుదల తేదీల పైన ఒక నిర్ణయానికి వచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాల విడుదల ముహూర్తం పైన స్పష్టత వచ్చింది. ఇప్పటికే తెలంగాణలో పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 8, 10, 12 తేదీల్లో ఏదో ఒక రోజున ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆయా తేదీల్లో ఫలితాల వెల్లడికి ప్రభుత్వ అనుమతి కోరారు. నిజానికి, తొలుత ఏప్రిల్ 6న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావించారు. అయితే, వాల్యుయేషన్ పూర్తి చేయటంతో పాటుగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పూర్తిగా సమాయత్తం అయిన తరువాత రెండో వారంలో ఫలితాల వెల్లడి దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 21 నుంచి మూల్యాంకనం మొదలైంది. ఈ మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 14లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఈ సారి ముందుగానే ఇంటర్ ఫలితాలు
ఏపీలో ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 21వ తేదీ లోగా ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నారు. రాష్ట్ రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మూల్యాంకనం కేంద్రాల్లో ఒక్కో లెక్చరర్‌కు ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబు పత్రాలను మూల్యాంకనానికి ఇస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి తిరిగి జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మే 31 నాటికే సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా పూర్తి చేయాలని ఈ రెండు రాష్ట్రాల బోర్డులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండు రాష్ట్రాల ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాల ప్రకటనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈమేరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సింగిల్ సబ్జెక్టు ఫెయిలైన వారితోపాటు ఒక్కో సబ్జెక్టులో కొన్ని జవాబుపత్రాలను ర్యాండమ్‌గా రీ-వెరిఫికేషన్ చేయించనున్నారు. ఆ తర్వాత సీజీజీలో ట్రయల్స్ నిర్వహించి అంతా సవ్యంగా ఉంటేనే ఫలితాలు విడుదల చేస్తారు. ఇక ఇంటర్మీడియట్ 2026-27 విద్యాసంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలకు మొత్తం 224 పనిదినాలు ఉండనున్నాయి. ఈ మేరకు కొత్త వార్షిక విద్యా క్యాలెండర్ (అకాడమిక్ క్యాలెండర్)ను విడుదల చేసారు.












Click it and Unblock the Notifications