జూన్ 1వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం, ఉత్తర్వులు జారీ..!!
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. తిరిగి విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం నుంచి కొత్త నిర్ణయాలు అమలుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వం సమాయత్తం అవుతున్నాయి. విద్యా కానుక పాఠశాలల ప్రారంభం సమయానికి అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జూన్ 1 నుంచి తరగతుల ప్రారంభం పైన తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీ, తెలంగాణలో వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ జూన్ 1వ తేదీ నుంచే జూనియర్ కాలేజీలు పునః ప్రారంభంకానున్నాయి. ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం జూన్ 1వ తేదీ నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడి యట్ తరగతులు పునఃప్రారంభిందుకు సిద్దం అయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ఇంటర్ బోర్డును కొత్త విద్యా సంవత్సరం క్యాలెండర్ ను ప్రకటించారు. ఏపీలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్ సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ కేలండర్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి తాజాగా విడుదల చేసింది.

ఇంటర్మీడియట్ తరగుతుల ప్రారంభం
కాగా, ఈ విద్యా సంవత్సరం మొత్తం 232 రోజులు పని చేయనున్నాయి. వేసవి సెలవుల అనంత రం జూన్ 1వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం అవుతాయి. ఇక తెలంగాణలోనూ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను మార్చి 30 విడుదల చేసింది. క్యాలెండర్ ప్రకారం ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు జూన్ నెల ఆరంభం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాదికి మొత్తం 224 పని దినాలు ఉండనున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే.. పాఠశాలలకు మాత్రం జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు యధా విధిగా కొనసాగనున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ తిరిగి తెరచుకోనున్నాయి.













Click it and Unblock the Notifications