దేశభద్రతకు ముప్పు, ఆదాయానికి గండి: ముఠా పట్టివేత (పిక్చర్స్)
హైదరాబాద్: వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీవోఐపీ) పద్ధతి ద్వారా అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను దారి మళ్లిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో మినీ ఎక్సేంజ్ నిర్వహిస్తున్నతీరుపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ సౌత్‌జోన్ ఇన్‌స్పెక్టర్ సుఖ్‌దేవ్‌సింగ్, సీసీఎస్ సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ రాజు తమ బృందాలతో కలిసి చాంద్రాయణగుట్టలోని గజిమిల్లత్ కాలనీలో నిర్వహిస్తున్న ఎక్సేంజ్‌పై దాడి చేశారు.

ఎక్సేంజ్ నిర్వాహకులు అతెరాం, ఇమ్రాన్‌లను అరెస్ట్ చేశామని సీసీఎస్ జాయింట్ పోలీస్ కమిషనర్ ప్రభాకర్‌రావు సోమవారం మీడియాకు తెలిపారు. వారి వద్ద నుంచి 565 సిమ్ కార్డులు, 528 ఎఫ్‌డబ్ల్యూటీస్, 17 వీఓఐపీ గేట్ వేలు, నాలుగు రూటర్లు, నాలుగు నెట్ హబ్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వారికి అన్ని సిమ్‌కార్డులు ఎలా వచ్చాయి, వాటి కోసం ఏ గుర్తింపు కార్డులు ఇచ్చారన్న విషయమై దర్యాప్తు చేస్తామని ప్రభాకర్‌రావు చెప్పారు. మినీ ఎక్సేంజ్ నిర్వహణకు అవసరమైన పరికరాలను సికింద్రాబాద్‌లోని సిఖ్ విలేజీ నుంచి కొనుగోలు చేశారని, దీనిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇర్ఫాన్, హబీబ్ సదాత్ పరారీలో ఉన్నారని ప్రభాకర్‌రావు వివరించారు.












Click it and Unblock the Notifications