ఆసక్తికరం: జానారెడ్డి ఒక్కడే ఉంటాడా, టిఆర్ఎస్‌లో చేరుతావా?

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మధ్య శుక్రవారం నాడు అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మధ్య శుక్రవారం నాడు అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది. పార్టీ మారే విషయమై ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషన చోటుచేసుకొంది.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీలోకి ఎప్పుడు వస్తావని అడిగారు. ఇందుకు సమాధానంగా 'అయితే మా పార్టీలో జానా రెడ్డి ఒక్కడే ఉంటాడా' అని కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎదురు ప్రశ్నించారు.

Intresting conversation between Komatireddy venkat reddy, Puvvada Ajay

ఈ సమాధానం విన్న పువ్వాడ 'నువ్వు కూడా వస్తున్నావా' అని చమత్కరించారు. అయితే టిఆర్ఎస్‌లో చేరే విషయమై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం దాట వేశారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ టిఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం గతంలో సాగింది. అయితే ఈ ప్రచారాన్ని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు.

నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంచి ఆదరణే ఉంది. వీరిని పార్టీలోకి చేర్చుకుంటే టీఆర్‌ఎస్‌కు జిల్లాలో తిరుగుండదనే అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ నుండి సానుకూల సంకేతాలు రావడం లేదనే ప్రచారం కూడ లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+