తెలంగాణాకు కరువు తప్పదా?.. సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన అందుకేనా!!
తెలంగాణ రాష్ట్రంలో ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా? తెలంగాణ రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోబోతుందా? తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నీటి సమస్య ఉందని కరువు పరిస్థితులను రైతులంతా కలిసి సమిష్టిగా ఎదుర్కొందామని చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం అదేనా? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఏడాదికాలంగా సరైన వర్షపాతం లేక రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో రేవంత్ రెడ్డి చేసిన షాకింగ్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుంటుంది అన్న అనుమానాలకు ఆజ్యం పోశాయి.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో నీటిసమస్య తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితులను అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలంటూ రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితికి అద్దం పడుతుంది. కరువు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించడం, అలాగే ఎండాకాలంలో తాగునీటికి సమస్య రాకుండా ఇప్పటినుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించడం రాష్ట్రంలోని పరిస్థితిని కళ్లకు కడుతుంది.
వేసవికాలం ఆరంభంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి పది టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తరలించాలని, అందుకు ట్యాంకులను సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ పరిధిలో నీటి ఎద్దడికి అవకాశం ఉన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టారు జిహెచ్ఎంసి, వాటర్ బోర్డు తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర నీటి సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్న నీటి వనరులను బట్టి హైదరాబాద్ కు తాగునీటి కటకట తప్పేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
నైరుతిలో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రంపైన ఎల్ నినో పరిస్థితుల కారణంగా దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా, కరువు బారిన పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలి అన్న దానిపైన సీఎంతో పాటు మంత్రులంతా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రైతులకు తాజా పరిస్థితిని వివరించి, రేవంత్ రెడ్డి అందరం కలిసికట్టుగా కరువు సమస్యను ఎదుర్కొందామని పేర్కొన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications