తెలంగాణ డిఎస్సీ ఇక ఫిబ్రవరిలోనేనా..?
తెలంగాణలో ఎన్నికల వార్తలు.. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది. ఎందుకంటే, తెలంగాణలో ఎన్నికల మోత మోగడంతో నియామక పరీక్షల ప్రక్రియలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా పడగా, తాజాగా ఎన్నికలతో ఉపాధ్యాయ పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పడు డిఎస్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడితే మాత్రం మళ్లీ ఫిబ్రవరిలోనే పరీక్షలు ఉండొచ్చేమోనని సమాచారం. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇక నిరాశే మిగిలనుంది.
ఇప్పటికే డిఎస్సీ షెడ్యూల్ విడుదల : ఇప్పటికే గ్రూప్-1 పరీక్షను రెండుసార్లు రద్దు చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదాపడింది. గ్రూప్-4 ఫలితాలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్. కానిస్టేబుల్ ఫలితాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో నిరుద్యోగుల్లో అసహనం పెరగనుంది. నవంబర్ జరగాల్సిన ఉపాధ్యాయ పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టిఆర్‌టి షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టులకు గాను నవంబర్ 20 నుంచి 30 వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది.

షెడ్యూల్‌లో భాగంగా స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులకు నవంబరు 20 నుంచి 24 వరకు, ఎస్‌జీటీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు ఉంటాయి. అయితే, నవంబరు 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్‌జీటీ పరీక్షలను వాయిదా వేయక తప్పదని భావిస్తున్నారు కొందరు.
మళ్లీ ఫిబ్రవరిలోనే : ఎన్నికల ప్రకియలో కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులే.. అటువంటి సమయంలో టీఆర్‌టి నిర్వహణపై ఎలా దృష్టి పెడతారని అంటున్నారు కొందరు. అయితే, నవంబర్ 20 నుంచి 24 వరకు జరిగే పరీక్షలపై ఎటువంటి ఇబ్బంది లేదని, ఇబ్బందల్లా నవంబర్ 25 నుంచి 30 వరకు జరిగే పరీక్షలపైనే అని, ఈ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని వినిపిస్తోంది. అయితే, ఇప్పడు కానీ, ఈ పరీక్షలు ఎన్నికల కారణంగా వాయిదా పడితే మాత్రం మళ్లీ ఫిబ్రవరిలోనే జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications