వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జీల సంఖ్య 42 కు పెంచడం హర్షదాయకం.!సీజేఐ ఎన్వీ రమణకు బోయినపల్లి వినోద్ కృతజ్ఞతలు.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేసారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేయడం హర్షణీయమని వినోద్ తెలిపారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారని, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు సీజేఐ ఆమోదం తెలిపడం సంతోషంగా ఉందన్నారు. న్యాయ‌మూర్తుల సంఖ్య‌ను పెంచాల‌ని హైకోర్టు రెండు సంవ‌త్స‌రాలుగా సుప్రీం కోర్టుకి విజ్ఞప్తి మేరకు సీజేఐ కీలక నిర్ణయం తీసుకున్నారు.

సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వినోద్..

సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వినోద్..

జ‌డ్జిల సంఖ్య‌ను పెంచ‌టం ప‌ట్ల తెలంగాణ న్యాయ‌వాదులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర హైకోర్టులో వివిధ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండటం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న 24 మంది జడ్జీలతో ఈ కేసుల పరిష్కారం సమస్యగా మారిందని వినోద్ తెలిపారు.

2019లో కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ.. అందుకు అనుగుణంగానే జడ్జీల సంఖ్యను పెంచారన్న మాజీ ఎంపీ..

2019లో కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ.. అందుకు అనుగుణంగానే జడ్జీల సంఖ్యను పెంచారన్న మాజీ ఎంపీ..

ఈ నేపథ్యంలో హైకోర్టులో జడ్జీల సంఖ్యను 42 కు పెంచడం వల్ల కేసులు సత్వర పరిష్కారానికి దోహదం చేస్తుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 15 ఫిబ్రవరి 2019 లో ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రి, సీజేఐ లకు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అంతకు ముందు కేంద్రానికి లేఖ రాశారని వినోద్ కుమార్ వివరించారు.

కేసుల పరిష్కారంలో వేగం.. న్యాయశాఖ గొప్ప నిర్ణయం తీసుకుందన్న వినోద్..

కేసుల పరిష్కారంలో వేగం.. న్యాయశాఖ గొప్ప నిర్ణయం తీసుకుందన్న వినోద్..

హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతపై తాను 2019 జనవరిలో పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించానని వినోద్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చించినట్లు ఆయన తెలిపారు. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత అయినా సరే తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకోవడం పట్ల వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ హైకోర్టు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.. న్యాయ ప్రక్రియ వేగవంతం అవుతుందన్న బోయినపల్లి..

తెలంగాణ హైకోర్టు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.. న్యాయ ప్రక్రియ వేగవంతం అవుతుందన్న బోయినపల్లి..

ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచిన సీజేఐ ఎన్వీ రమణ కు వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.అంతే కాకుండా న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో, న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంలో తెలంగాణ హైకోర్టు ఖచ్చితంగా దేశానికి స్ఫూర్తిదాయకం అవుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నానని వినోద్ అన్నారు. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు వినోద్ తెలిపారు.

English summary
State Planning Commission Vice-Chairman Boinapalli Vinod Kumar said it was historic that the Supreme Court Chief Justice NV Ramana had taken a crucial decision to increase the number of judges in the Telangana High Court by 75 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X