సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ, ఘనస్వాగతం (ఫోటోలు)
హైదరాబాద్: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో దూసుకెళుతున్నారు. రాష్ర్టానికి పెట్టుబడులు సాధించేందుకు అమెరికాకు వెళ్లిన కేటీఆర్ ఇప్పటికే పలు సాప్ట్‌వేర్ దిగ్గజ సంస్ధల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా సోమవారం వాషింగ్టన్ రెడ్‌మాండ్‌లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో సత్య నాదెళ్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్, హైదరాబాద్‌ల మధ్య ఉన్న ఐటీ బంధాన్ని సత్య నాదెళ్లకు మంత్రి కేటీఆర్ వివరించారు. మైక్రోసాఫ్ట్ విస్తరణకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రదేశమని మంత్రి తెలిపారు.

సియాటిల్‌లో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం
అంతకుముందు మంత్రి కేటీఆర్ తెలంగాణ డయస్పోరా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నారైలకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, తీసుకున్న నిర్ణయాలను మంత్రి వివరించారు.

సియాటిల్‌లో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం
సోమవారం ఉదయం మంత్రి కేటీఆర్‌కు సియాటిల్‌లో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. సియాటిల్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలంగాణ ఎన్నారైలు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానం పలికారు.

సియాటిల్‌లో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జై తెలంగాణ నినాదాలు చేశారు. భారీస్థాయిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వివిధ రంగాల్లోని తెలంగాణ ప్రముఖులు మంత్రిని కలుసుకున్నారు.

సియాటిల్‌లో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం
మంత్రితో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. అమెజాన్ కంపెనీ సీఈవోతో కూడా మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. హైదరాబాద్‌లో వ్యాపార విస్తరణకు అమెజాన్ సంస్థ ఇటీవల అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.
కొత్త తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని అమలుచేస్తున్న తమ ప్రభుత్వం కంపెనీలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని వివరించారు. మైక్రోసాఫ్ట్ విస్తరణకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవాలని, త్వరలో హైదరాబాద్‌లో పర్యటించాలని సత్యనాదెళ్లను కోరారు.
దీనికి సత్య నాదెళ్ల స్పందిస్తూ, హైదరాబాద్‌తో తనది ప్రత్యేకమైన అనుబంధమని చెప్పారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ విస్తరణను పరిశీలిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్లకు మంత్రి కేటీఆర్ చార్మినార్ బొమ్మను జ్ఞాపికగా బహూకరించారు.












Click it and Unblock the Notifications