సుకుమార్‌పై ఐటీ కొరడా: ఎయిర్‌పోర్ట్‌లోనే పికప్- నేరుగా ఇంటికి
Sukumar: ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు టాలీవుడ్‌లో కలకలం రేపుతోన్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తెల్లవారు జాము నుంచి ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి.
రెండోరోజు కూడా హైదరాబాద్‌లో పలుచోట్ల ఈ ఐటీ దాడులు సాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రెండో రోజు కూడా హైదరాబాద్‌లో ఐటీ సోదాలు ముమ్మరం అయ్యాయి. శ్రీవేకంటేశ్వర క్రియేషన్స్‌తో మొదలైన ఈ తనిఖీలు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. ఆయా నిర్మాణ సంస్థలు సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీస్తోన్నారు.
ఇప్పుడు తాజాగా పుష్ప-2 దర్శకుడు సుకుమార్ కూడా ఐటీ రాడార్‌లోకి వెళ్లిపోయారు. ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ సహా ఆయనకు ఉన్న ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తోన్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే పికప్ చేసుకున్నట్లు సమాచారం.
ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత దిల్ రాజునే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ రెండూ తెరకెక్కాయి. మూడు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి. ఈ నెల 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి.
ఈ రెండు సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
పుష్ప 2ను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు సుకుమార్ 15 కోట్ల రూపాయల మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆదాయపు పన్నులను ఆయన చెల్లించారా? లేదా? అని ఐటీ అధికారులు ఆరా తీస్తోన్నట్లు చెబుతున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications