హెటిరో డ్రగ్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు: రూ. 100 కోట్లకుపైగా నగదు స్వాధీనం
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఆదాయపుపన్ను శాఖ సోదాలు కొనసాగాయి. సంస్థ కీలక వ్యక్తుల నివాసాల్లో తనిఖీలు ముగిసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. హెటిరో డ్రగ్స్ సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్లు పేర్కొన్నారు.
కాగా, సనత్‌నగర్ కార్పొరేట్ కార్యాలయంతోపాటు ఏపీలోని నక్కలపల్లి, జీడిమట్ల కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలున్నట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే రెండు మూడు ప్రాంతాల్లో రూ. 100 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ నగదుపై ఉన్న బ్యాంక్ సీల్‌ను పరిశీలించడంతోపాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారరు? ఏ బ్యాంక్ నుంచి, ఎవరు డ్రా చేశారు? ఆ మొత్తం ఎక్కడిది అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు.
సోదాల సందర్బంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు, డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత మరిన్ని విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రేపు కూడా సోదాలు జరగనుండటంతో ఆ తర్వాత ఐటీ అధికారులు వివరాలు వెల్లడించే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీకృష్ణ జువెల్లరీ దుకాణాల్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ నగరంలోని శ్రీకృష్ణ జువెలరీ దుకాణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయం సహా ఇతర దుకాణాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. పలు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Recommended Video
రూ. 330 కోట్ల విలువైన 1100 కిలోల బంగారం ఆభరణాలను మళ్లించి నిబందనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గతంలో ఈ జువెల్లర్స్‌పై డీఆర్ఐ కేసు నమోదు చేసింది. రంగారెడ్డి జిల్లా రావిలాల యూనిట్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి 2019లో సంస్థ ప్రదీప్ కుమార్ తోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు ఆధారంగానే మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు ఆధారాలు గుర్తించి సోదాలు చేపట్టారు.












Click it and Unblock the Notifications