క్యాష్ లెస్‌పై అమెరికాకే 25 ఏళ్లు పట్టింది, రూ.16 లక్షల కోట్లు విత్ డ్రా: దత్తాత్రేయ
క్యాష్ లెస్ లావాదేవీలు పూర్తి చేయడానికి అమెరికాకే 25 సంవత్సరాలు పట్టిందని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు అన్నారు.
హైదరాబాద్: క్యాష్ లెస్ లావాదేవీలు పూర్తి చేయడానికి అమెరికాకే 25 సంవత్సరాలు పట్టిందని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు అన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు పెద్ద ఆర్థిక విప్లవం అని చెప్పారు.
రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.15వేల కోట్లు వచ్చాయని చెప్పారు. ఇప్పటి వరకు రూ.3.5 లక్షల కోట్ల నగదు పంపిణీ జరిగిందని తెలిపారు. రూ.12 లక్షల పాత నోట్లు డిపాజిట్ అయినట్లు దత్తాత్రేయ చెప్పారు. రూ.16 లక్షల కోట్లు విత్ డ్రా అయ్యాయని తెలిపారు.

విపక్షాలు నోట్ల రద్దుకు సహకరించకపోయినప్పటికీ దుష్ప్రచారం చేయవద్దని దత్తాత్రేయ హితవు పలికారు. నల్ల కుబేరులకు సాయం చేయవద్దన్నారు. క్యాష్ లెస్ లావాదేవీలు పూర్తి చేసేందుకు అమెరికాకు ఇరవై అయిదు సంవత్సరాలు పట్టిందని చెప్పారు.
హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందాలంటే కార్మిక చట్టాలు పక్కాగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. బహుళ అంతస్తుల పైన ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. అక్రమ నిర్మాణాల పైన కఠినంగా ఉండాలన్నరు.












Click it and Unblock the Notifications