వీడియో: ఒకే వేదికపై జగన్, కేటీఆర్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే ఈవెంట్ లో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వీళ్లిద్దరూ పాల్గొన్నారు. ఇదే ఈవెంట్ లో వేదికపై నిల్చొని అవార్డులు అందజేశారు. అనంతరం పక్కపక్కనే కూర్చొన్నారు. అలా కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఇద్దరు నేతలు ఇలా ఒకే ఫంక్షన్ లో కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఒకే ఈవెంట్ లో కలిశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వీరి భేటీ జరిగింది. ఇదే ఫంక్షన్ లో వేదికపై నిల్చొని పలువురికి అవార్డులు అందజేశారు. అనంతరం పక్కపక్కనే ఇద్దరూ కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇటీవల బీఆర్ఎస్ పాలనపై జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
బెంగళూరులో జగన్, కేటీఆర్ ఆత్మీయ కలయిక
— vm_updates (@VijayMarka88) November 22, 2025
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. pic.twitter.com/wRsZm9wAcY
ఇక ఇటీవల తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనపై, హైదరాబాద్ అభివృద్ధిపై జగన్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అయితే ఇది వ్యక్తిగత పర్యటన అని, రాజకీయాలకు సంబంధించినది కాదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications