జనసేనకు సీట్లు ఖరారు - బరిలోకి పవన్ కల్యాణ్..!!
ఇటలీ పర్యటన ముగించుకొచ్చిన జనసేనాని ఇక ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఖాయం చేసుకున్న పవన్.. తెలంగాణలో బీజేపీకి మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ భాగస్వాములుగా రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లోబరిలోకి దిగాయి. జనసేన కు ఇచ్చే సీట్ల పైన బీజేపీ తుది నిర్ణయానికి వచ్చింది. బీజేపీ ప్రతిపాదించిన సీట్లకు జనసేనాని ఆమోద ముద్ర వేస్తే ఈ సీట్లను అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్దమైంది.
జనసేనకు కేటాయించే సీట్లు: తెలంగాణలో బీజేపీ - జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. జనసేనకు 8 లేదా 9 సీట్లు ఇచ్చే అంశమై బీజేపీ లిస్టు సిద్దం చేసింది. ఈ జాబితాను జనసేనాని పవన్ కు పంపింది. వరుణ్ తేజ్ వివాహం కోసం ఇటలీకి వెళ్లిన పవన్ తిరిగి వచ్చారు. జనసేనకు కేటాయించిన స్థానాలు..అభ్యర్దుల విషయం పైన పార్టీ నేతలతో చర్చించిన తరవాత రేపు అధికారికంగా తమ పార్టీ పోటీ చేసే సీట్లు..అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జనసేన తెలంగాణలో 32 సీట్లకు పోటీ చేయాలని భావించింది. బీజేపీ నుంచి ప్రతిపాదన రావటంతో ఢిల్లీ కేంద్రంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో చర్చలు జరిగాయి. దీంతో, జనసేన కనీసం 20 సీట్లు ఇవ్వాలని కోరగా.. బీజేపీ 8-9 సీట్లు ఇచ్చేందుకు జాబితా సిద్దం చేసిందది.
బీజేపీ - జనసేన పొత్తుతో: బీజేపీ నేతల సమాచారం మేరకు ఖమ్మంలో జనసేనకు 4 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో రెండు సీట్లు కేటాయించునున్నట్లు సమాచారం. కుకట్ పల్లి సీటు పైన బీజేపీ స్థానిక నేతల నుంచి వ్యతిరేకత మొదలైంది. దీంతో, బీజేపీ పునారలోచనలో పడింది. జాబితాలో కూకట్ పల్లి, తాండూర్, ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్ కర్నూల్ ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సాఆర్టీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో సెటిలర్ల ఓటు బ్యాంకు తమకు అనుకూలిస్తుందని జనసేన భావిస్తోంది. అయితే బీజేపీ ఆశావహులు మాత్రం పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్ధుబాటు అంశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జనసేనతో సీట్ల సర్దుబాటు తమ సీట్లకు ఎసరు వస్తున్నదని పలువురు వాపోతున్నారు.
ఎన్నికల ప్రచారంలోకి పవన్: ఈ జాబితా ఫైనల్ అయిన తరువాత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఇప్పటికే పవన్ ప్రచారానికి సంబంధించి బీజేపీ నేతలు స్పష్టత ఇచ్చారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో తొలి విడత ప్రచారం చేయనున్న పవన్..ఆ తరువాత బీజేపీ కోరిన ప్రాంతాల్లొనూ ప్రచారానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాతనే ఏపీలో వారాహి యాత్ర కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారని..అటువంటి పవన్ తో బీజేపీ పొత్తు పెట్టుకుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పవన్ ఎన్నికల ప్రచారంలోకి దిగితే ఎవరిని టార్గెట్ చేస్తారు..ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారనే ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications